పుట:Shodashakumaara-charitramu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

159


వారుణీసక్తులై పెఱవార లెట్లు
చక్క నిలువంగగ నేర్తురు నిక్క మరయ.

67


క.

దినలక్ష్మి యినుఁడు చనుటయు
ననుగమనము సేయఁ పశ్చిమాచలమున నొ
ట్టిన యెఱమంటలపోలిక
ఘనసంధ్యారాగరుచులు గడు నొప్పారెన్.

68


గీ.

మించె నెఱసంజ లడరి యామీఁదఁ దార
లల్లనల్లనఁ దోతెంచెఁ బెల్లు గాఁగ
నూతనంబుగ నంబరానోకహంబు
చిగురు నిండారఁ బెట్టి పూచెనొ యనంగ.

69


గీ.

జలరుహములు సూర్యబల మేమియును లేమిఁ
జంద్రుఁ డొప్పకునికి జాలఁ గుందె
గ్రహబలంబు లేనికాలంబు నెంతటి
సిరులు గలుగువారుఁ జిక్కు వడరె.

70


సీ.

మధుపసంఘంబులు మట్టి మల్లాడుచుఁ
        గువలయంబులు చూఱఁగొనఁదొడంగె
ద్విజకోటి సన్మార్గవిహరణంబులు దక్కి
        యడఁగి కుజాతుల నాశ్రయించెఁ
బతులచేరువ లేనిభామల డగ్గఱి
        మారుండు భీతి నిండారఁ జేసెఁ
గులశీలవిధములఁ దలఁపంగనేరక
        జారచోరావలి సంచరించె
మహి వివేకులు ఘసతమోమార్గులైరి
యేకవర్ణత వాటిల్లె లోకమునకు