పుట:Shodashakumaara-charitramu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

157


నిండిన వేడ్కలు దనరఁగ
నొండొరులం జూడఁ గన్ను లువ్విళ్ళూరన్.

61


వ.

అంతం బురోహితమంగళాచారానంతరంబ మౌహూర్తికదత్తశుభముహూర్తంబునం దెర యెత్తించిన.

62


సీ.

లజ్జఁ గొండొకసేపు లలనదృగ్జాలముల్
        ఱెప్పలలోనన యుప్పతిల్లు
విచ్చల విడిఁబర్వి విభునివీక్షణములు
        మెలఁత మోహనమూర్తిమీఁదఁ బర్వుఁ
దనరెడు వేడుకఁ దన్వంగిచూపులు
        చెలువునిమోముపైఁ బొలసి మగుడుఁ
జూపులు దార్కొన సుదతీలలామంబు
        లలితంపు సిగ్గునఁ గళవళించు
నపుడు దమచందములు చూచి యలరుప్రోడ
యలరుఁబోఁడుల సరసోక్తు లమృతరసము
సోన లొలికించె నెంతయు సొబగుమిగిలి
తమకు నప్పుడు చెవుల కుత్సవ మొనర్ప.

63


సీ.

పళ్ళెరంబుల నున్నప్రాలు దోయిట ముంచి
        పాణిపద్మంబులు భ్రమలు నిండ
సేసలు పెట్టంగఁ జేతు లెత్తెడుచోటఁ
        గరమూలరోచులు గ్రమ్ముదేర
చే(తెం)డ్లు దెచ్చుచో సితకటాక్షంబుల
        మించి నీరెండల ముంచికొనఁగఁ
దలఁబ్రాలసందడిఁ జెలువపయ్యెద నాసి
        యిఱిచన్నుఁగవకాంతి గిఱికొనంగఁ