పుట:Shodashakumaara-charitramu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

షోడశకుమారచరిత్రము


గీ.

ఇందులోన నెవ్వారికి నెఱుకలేద
యకట పూఁబాన్సు చేసెద మనుచుఁ దెచ్చి
భావసంభవునమ్ములపాన్పుమీద
ముదితఁ బెట్టినవారలు మోసపోయి.

23


వ.

అని యయ్యింతివలవంత సూచి నెచ్చెలులు పలుమాటల వలరాజు నుద్దేశించి.

24


గీ.

పద్మభవునిమీఁదఁ బంకజోదరుమీఁద
హరునిమీఁద వేసినట్టిశరము
నబలమీఁదఁ జాల నదయత నేయంగఁ
బంచబాణ నీకుఁ బాడి యగునె.

25


వ.

అని పలికి యేమిట సమ్మగువమేన నుద్దీపించిన మదనతాపంబు వాయకున్న నిట్లనియె.

26


చ.

హరునిటలాగ్ని రూ పఱియు నంగజుఁ డప్పుడ పుట్టె రాఘవే
శ్వరుఁడు శపించినం బికరవంబులు గ్రమ్మఱఁ గల్గె రాహు ని
ష్ఠురగతిఁ బట్టి మ్రింగినను సోముఁడు వెల్వడివచ్చెఁ జెల్లఁబో
విరహులఁ బొందియున్నశని వీడియు వీడద యేమి సేయుదున్.

27


వ.

అని పలికి యిందువదనకు మనసేయు చలిమందుల మదనతాపంబు దీపించె నింక నివి వలదని శిశిరోపచారంబుల పనిచాలించి చింతింపం దొడంగిస నక్కమలమంజరిం జేరం జని.

28


మ.

తరుణీ నే నొకసిద్ధపుంగవుని నత్యంతంబు సేవించి యే
నరు లేరూపులు సూడ నర్థివడినం దద్భావము ల్గొంతసే
పరుదారం బొడసూపవచ్చువరవిద్య న్వేఁడికొన్న న్మనో
హరభావస్ఫురదింద్రజాలవరవిద్య న్నాకు నిచ్చెన్ దయన్.

29