పుట:Shodashakumaara-charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

147


నీచిత్తమువాఁడే పతి
యోచెలి యిటు లేల చింత నొందఁగ నీకున్.

16


చ.

అనిన నమ్మాటకు నెమ్మనమున నమ్మిక జనింపకున్న నచ్చెలువ నెచ్చెలి నాలోకించి.

17


ఉ.

ఓజలజాక్షి, నీవు నను నూఱడఁ బల్కెదు గాక వచ్చునే
రాజశుకంబు, వీడ్వెడలి రమ్మనిన న్నను నేల, నమ్మహా
రాజున కిచ్చఁగూర్చి యిటు రా మన మెక్కడ నాతఁ డెక్క డే
యోజఘటించుఁ గార్యము శుకోక్తుల నిట్లడియాస వెట్టునో.

18


క.

అని పలుమఱుఁ దలపోయఁగ
దినదినమున కంగజుండు ధృతి దూలింపన్
మనమున గలఁగుచుఁ దేఱుచు
ఘనపరితాపంబుచేతఁ గ్రాఁగఁదొడంగెన్.

19


మ.

ప్రిదిలెం జేతులకంకణంబులు సఖీబృందంబుపై మచ్చికల్
వదలె న్మత్తమధువ్రతారవముల న్వాసంతికావహ్నిచే
నదలెన్ ధైర్యము చిత్తసంభవశరవ్యం బై మనోబ్జంబు గ్ర
క్కదలెన్ మైఁబరితాపవహ్ని పొదలెం గంజాతపత్రాక్షికిన్.

20


వ.

అవ్విధంబు గనుంగొని కమలమంజరి చిత్తంబునఁ జలింప నెచ్చెలి నవలోకించి.

21


గీ.

చిలుక వెంటన వలరాచచిచ్చు దగిలి
యకట పన్నీరు చల్లిన నాఱిపోదు
పుష్పధూళి పైబోసినఁ బొనుఁగుపడదు
కొమ్మ నేక్రియ నోముదు నమ్మలార.

22