పుట:Shodashakumaara-charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

షోడశకుమారచరిత్రము


క.

చిలుకఁ బిలిపించి రసవ
త్ఫలములు పసదనము నిచ్చి తథ్యసువర్ణో
జ్వలచేల మొసఁగి సద్గుణ
కలితాపురుషార్థనిధివి గ మ్మని పలికెన్.

10


క.

ఆర్యనుతిపాత్ర మగున
య్యార్యఁ జదివి చూచి మెచ్చి యాశుకమును రూ
పార్య వగునీకు శిఖిచం
ద్రార్యమనయనసము నమ్మహాత్మునిఁ దెత్తున్.

11


వ.

అని పలికి సముచితప్రకారంబున వీడుకొని రాజశుకంబు చనుటయు నది యవశ్యంబు నిన్నుఁ దెచ్చు ననునాస నూఱడి యనేకదివసంబు లెదురుచూచి రాక తడసిన నొక్కనాఁ డమ్మంజువాణి కమలమంజరి దెసఁ గనుంగొని.

12


క.

ఆచిత్రాకృతి పతి దృ
గ్గోచరుఁ డగుటయును గల దొకో యొకనాఁ డా
రాచూలిని నిట్లన వల
రాచయురులఁ బెట్టు నొక్కొ రాచిలుక చెలీ.

13


క.

మెచ్చు నొకొ యార్య యిచ్చకు
వచ్చు నొకో రాజశుకమువాక్యము లతనిం
దెచ్చు నొకొ చిలుక యెంతకుఁ
దెచ్చు నొకో మరుఁడు నన్నుఁ బతిఁ దేకున్నన్.

14


వ.

అనినఁ గమలమంజరి యిట్లనియె.

15


క.

నీచెలువము రసికాగ్రణి
యాచిలుక నుతింప మిగుల నరయక యుండన్