పుట:Shodashakumaara-charitramu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

145


నరులున ఱెప్పవెట్టక చలాకృతిగుం........నేపుదానుజి
త్తరువునఁబోలె నుండి వనితామణి రాగపయోధిమగ్న యై.

5


వ.

అప్పుడు.

6


సీ.

సుదతి యారూపంబు చూచినయట్లైన
        లీలమై ఱెప్పలు వ్రాలవైచు
భామ యారూపంబు పలికినయట్లైన
        వేడుక మాటలు వినఁగఁ గోరు
నింతి యారూపు ద న్నెలయించినట్లైన
        నర్థిఁ జేరఁగఁ జన నప్పళించుఁ
గాంత యారూపంబు గదిసినయట్లైన
        నాలింగనము సేయ నాససేయు
నివ్విధమునఁ జిత్త మెంతయుఁ దగిలినఁ
దన్ను మఱచి యుండె ధవళనయన
లలితచిత్ర మగుటఁ దెలిసియుఁ దెలియక
మరుఁడు దన్ను మిగుల మరులుకొలుప.

7


వ.

ఇట్లత్యంతసుందరం బగు నచ్చిత్రరూపంబుఁ జూచి యిచ్చట నీరూపం బెవ్వరు వ్రాసి రని యడిగిన సకలవిద్యావిశారదత్వంబు..............

8


చ.

............................................................
..................................................................
.................................................నొప్పెసలార రక్తచం
దనమున వ్రాసి యింతి మఱునాఁడు ప్రమోదము నివ్వటిల్లఁగన్.

9