పుట:Shodashakumaara-charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వానము

139


యమ్మహీజము గాల నడరు పెన్మంటల
        బగలింటిగతి దీప్తి పరఁగుటయును
బహుళతకరదీపపంక్తులు వెలుగొంద
        భద్రగజంబుపైఁ బ్రజ్వరిల్ల
గమలమంజరిమ్రోల డగ్గరి వసింప
నతిమనోహరమూర్తిఁ బెం పందియున్న
చెలువుఁ గమలాకరుని గన్ను లలరఁ జూచి
యచ్చెరువు రాగశోకంబు లాత్మఁ దనర.

109


క.

రాచిలుక మున్ను వ్రాసిన
యాచిత్రము గజము మీఁది కరుదెంచిన య
ట్లే చూపులపండువ యగు
నా చెలువునిచెలువ మాత్మ నలరింపంగన్.

110


శా.

ఈరా జాశుకరాజు చెప్పినతఁ డౌ నీ చెల్వు చెల్వంబుఁ గ
న్నారం గన్గొని కాము బారిఁ బడి మాయ ల్వన్ని నన్బాపి నే
ర్పారంగా వరియించె నన్శిఖికి నాహారంబు గావించెఁ బెం
పార న్నాకొఱకై కుజుంబు నిటు సేయం బంచెఁ బాపాత్మ యై.

111


సీ.

ఈవరు మదిఁగోరి యిచటి కేతెంచిన
        నెదలోన ననుమాన మేల పుట్ట
వరునియున్నెడకు జవ్వనిఁ బంపఁ దగ దన
        కేల పంపితి దీని నితనికడకు
నితని నిందించిన నిట్టివాఁడు నృపాలుఁ
        డే యన బుద్ధి నా కేలపుట్టె
హీనభావునకు నన్నీఁడని యెఱిఁగియు
        నాతండ్రి మది నేల నమ్మనైతి