పుట:Shodashakumaara-charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

షోడశకుమారచరిత్రము


వ.

కన్ను లొకించుక దెఱచి, యీ రెలుంగున నతనికి వినవచ్చునట్లుగా నిట్లనియె.

104


మ.

అలభూజంబుననుండి దైత్యపతి యత్యాభీలభంగిన్ దృగం
చలముల్ నిప్పుల వెల్లి గొల్ప ననుఁ దా జంకించినన్ భీతిమై
నులుకం గన్నులు మోడ్చి భ్రాంతమతి నై యున్నంత నామ్రోల ను
జ్జ్వలవిప్రాకృతిఁ దోఁచి యిట్లనియె వాత్సల్యంబు దీపింపఁగన్.

105


ఉ.

ఇక్కుజ మగ్నిదేవునకు నిప్పుడ యాహుతి చేయఁ ద్రుంగు నీ
రక్కెసఁ ద్రుంపకున్న నిది రాసుతుతో మననీదు నిన్ను నీ
వెక్కుడుభీతి మైఁ గలఁగ నేటికి నీపతితోడ నింతయున్
స్రుక్కక చెప్పుమం చరిగె సోఁకును బాయఁ దొడంగె నంతటన్.

106


క.

నావుడు నే నవ్విధమును
వేవే చేయింతు నీవు వెఱవకు మని దం
తావళము నిలుపఁ బంచి మ
హీవిభుఁ డయ్యింతి మ్రోల నిడుకొని కడకన్.

107


క.

భటకోటిఁ జూచి మీ రీ
విటపిని దహియింపుఁ డనిన వెసఁ గాష్ఠము లొ
క్కట మొదల నొంటి యం దు
త్కటముగ నలుదెసల నగ్గి దరికొల్పి రొగిన్.

108


సీ.

అంతకముంద యయ్యగకోటరంబున
        నురగభయంబుచే నుండ నోడి
హంసావళి తొలంగి యత్తోఁటయం దొక్క
        చో నొకపొదరింటిలోన నుండి