పుట:Shodashakumaara-charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

129


వేది యని యేనుం జెప్ప నీసఖుఁ డెఱింగి యతనికిం బ్రణమిల్లి మీతెఱం గడిగిన నామహానుభావుండు నావదనం బవలోకించి.

60


సీ.

పుత్రవర్ధననామపురము నేలెడురాజు
        తనకూతుఁ బరదేశమునకు నొసఁగఁ
జాలక యాసరోజాతలోచనఁ జూచి
        యిప్పురికొమరుల నెల్ల వరుస
నీకడ కరుదేర నియమంబు చే సేద
        నందులో నీ మెచ్చునట్టివాని
హృదయేశుఁగా వరియింపుము నీ పని
        నేఁడు చెప్పినవాఁడ నీ వచటికిఁ
దీవ్రగతి నేగి దాని కదృశ్యుఁడ వయి
రాత్రు లరుదెంచి తత్కుమారకుల నోలి
ననుదినంబు నాహారంబు గొనుచు నుండు
మతనిచెలి యొకఁ డొక్కనాఁ డరుగుదెంచు.

61


వ.

ఆతండు కేవలపురుషుండు గాఁడు గావున నీభావంబుం గనుంగొని పేరువాఁడి నీమీఁదం గవియునప్పుడు నీవృత్తాంతంబుఁ జెప్పి యిరువురం గూర్పుము నీవు గూర్చినవెనుకఁ గతిపయదినంబుల వీరుం దమరాజును జెలులం గలసెద రని పలికి నిజేచ్ఛ నరిగె నతనివచనప్రకారంబున నిన్నుం బొడగాంచి కృతార్థుండ నైతి నెల్లి నీనెచ్చెలి నిచ్చటికిం దోకొని వచ్చెద ననినం బరమానందభరితమానసుండ నై యాదనుజుపుంగవుం గవుంగిలించుకొని యతిరయంబునం దోడ్కొని రమ్మని పనిచిన నతండును నతిత్వరితగతిం జని తద్వృత్తాం