పుట:Shodashakumaara-charitramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

119


వ.

అయ్యిరువురం బరాజితులం చేసి పట్టితెం డని చుడబలు లగుతనమంత్రులం బంచినం బని పూని వారు సన్నద్ధు లై తేరులు దోలుకొని యాశూరులం జేర నరిగి చూచి యయ్యిరువురును దమదృఢముష్టియు దీర్ఘబాహుండును నైనం బరమానందంబు నొందునంత నాభీమభటాదులుం గని యుల్లంబున నుల్లసిల్లి.

5


దృఢముష్టిదీర్ఘబాహులకథ

క.

వా రిరువురు సంభ్రమమునం
దేరులు డిగఁగా రథావతీర్ణు లయిన వే
వా రందఱు నమ్మంత్రులు
జేరియుఁ బరిరంభణంబు చేసి ముదమునన్.

6


వ.

భూపాలుపాలికిం గొని చనిన నవ్విభుండు దవ్వులనే యామంత్రులం గని యామోదంబున నెదురు చని తత్ప్రణామంబు లాదరించి యెత్తి యిరువుర నొక్కకౌఁగిటం జేర్చి గారవించి యుచితాసనంబుల నుండ నియోగించి సింహాసనాసీనుండై తదీయవదనంబులం జూడ్కి నిలిపి మీ రెచ్చటం జరియించి యిప్పురంబున కరుగుదెంచితి రని యడిగిన దీర్ఘబాహుండు కరకమలంబులు మొగిడ్చి.

7


గీ.

వింధ్యమున నేను మి మ్మటు వెదకఁ బూని
పెక్కుభూములఁ జరియించి యొక్కనాఁడు
వరవిభవరమ్య మైనట్టిపురముఁ జొచ్చి
యం దొకమహీసురునియింటి కరుగుటయును.

8


వ.

ఆయింటి ముదుసలి శోకవ్యాకుల యై యుండి నన్ను నాలోకించి.

9