పుట:Shodashakumaara-charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

సప్తమాశ్వాసము

క.

శ్రీభార్గవకామందక
వైభావసవోపధార్యవాసవమంత్రి
ప్రాభవవిడంబధీగుణ
శోభితపాడ్గుణ్య యన్నసూరవరేణ్యా.

1


చ.

ఎదురుగ వచ్చి కాంచు ధరణీశుల రాజ్యము లిచ్చి నిల్పుచు
న్మదమున మాఱుకొన్న నృపమండలి నింద్రునివీటి కంచుచుం
బదవులు మార్చి దుర్నృపుల బంధనశాలలఁ బెట్టఁ బంచుచు
న్విదితబలాఢ్యుఁ డానృపుఁడు విశ్రుతలీలల పాలుచున్నెడన్.

2


గీ.

పుత్రవర్ధన మనియెడు పురమురాజు
గాన రాఁడు దేవర నతిగర్వి యనుచుఁ
జారు లెఱిఁగింప నధికరోషమునఁ గదలి
వీఁక జని యప్పురముమీఁద విడియుటయును.

3


క.

అరదంబు లెక్కి యిద్దఱుఁ
బురము వెడలి వీఁక వచ్చి భూమి యద్రువ ను
ద్ధురగతి నార్చుచు బలములఁ
బొరిగొనఁ దొడఁగుటయు విని విభుం డలుకమెయిన్.

4