పుట:ShivaTandavam.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రొత్తఁదోమిన దంతకోరకంబుల గాంతి
గుత్తులుగ గుత్తులుగ హత్తికొన శివుపైని
                        యాడినది గిరికన్నె!

సమపాదయుతమైన స్థానకస్థితి నిలచి
క్రమముగాఁ జూపులను గంజాక్షి విరజిమ్మి
ఘలుఘల్లుఘలు మనెడి వలయునాదములతోఁ
చిలిపినవ్వుల సుమాంజలి వట్టి శివునికై
                        యాడినది గిరికన్నె!

వెలయంగఁ దొమ్మిదగు విధములను చెలువముగ
నలినాక్షి భూచారినాట్యములు[1] జూపించి
పదునాఱగు ఖచారిపద్ధతుల[2] నెసగించి
మదిరాక్షి గతిచారి మధురిమలు బొసఁగించి
                        యాడినది గిరికన్నె!

శిరము చూపులు మించు చెక్కిళ్ళు కనుబొమలు
తరుణాధరము పయోధరములును దంతములు
ముఖరాగచిబుకములు మొదలైన వావగలు
సకియ, భావానుగుణ చాలనంబుల నెసఁగ
                        నాడినది గిరికన్నె!

  1. నేలపైనిలిచి చేయు నాట్యము.
  2. పైకి చెంగించుచు జేయు నాట్యము.