పుట:ShivaTandavam.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరసిలో లేయలల తెరలవలె నుబుకునో!
స్వరపంపకములోన జాతులను వెసమార్చి
మానతైష్ణ్యం బదెంతటిదో! దాళము వేయఁ
బూని యమరులు దప్పిపోయినా రెచ్చటనొ!
శ్రుతిలయంబెంత పెచ్చుగ రేగెనో! సర
స్వతిగుండె కంపించి జలజలా బారంగ

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

అఱపల్కు వచియించి యక్షులను బూరించుఁ
బూరించునర్థంబుఁ బొందించు హస్తముల
మొదలఁ గన్నులఁ గొంత ముచ్చటించును మిగులుఁ
గదియించు వాఙ్మయాఖండ పుణ్యము బండఁ
గనులసైగలు మాటఁ పెనవేసి చూపించు
వెనుక మాటలుబల్కి, మును దీర్చుఁ గన్నులను
వచియించిపల్కు, లావల నేత్రముల దిద్దు
ఖచరులెల్లరును దిగ్భ్రమ మొంది వీక్షింప

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

సంయుతకరంబులను[1] శాస్త్రాను సారంబ
సంయుతకరంబులను[2] జక్కఁగాఁ గదియించి

  1. రెండు చేతుల హస్తముద్రలు సముదితములై యొక యర్థమును జూపించిన సంయుతహస్తమని పేరు.
  2. ఒక చేతిలోనే భాగముజూపు ముద్రకు అసంయుతహస్తమని పేరు.