పుట:Shathaka-Kavula-Charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు.

15

ఈవిశేషములలోఁ గొన్నిపండితయ్యకును బ్రసిద్ధ మైనవి. బాహ్మణుఁడు, కవి, పండితుఁడు, యతి, అమోఘవచస్కుఁ డన్నవి శివతత్త్వశబ్దముతోఁ గలిసి యనుమానమును బలపఱచుచున్నవి. నన్నెచోడుఁ డొకచోట శివు నిట్లు పేర్కొ నెను.

"(1) జంగమమల్లికార్జు౯ (2) జంగమమల్లయ;” కుమారసంభవము 8. 61; 8. 62 శివునకుఁ దనగురువునకు సమాననామముల వాడినాఁడు. ముని, జంగము, బ్రహ్మచారి యగుమల్లికార్జునుఁడు పండితమల్లికార్జునుఁ డనుట కింకను బలవత్తర మగుప్రమాణములు దొరకవలసియున్న దనియే ప్రస్తుతము నాయూహ ! అత్యధికముగఁ బూజనీయుఁ డగునీపండితునిరచన మాంధ్రభాష యందలిశైవవాఙ్మయమునకు, శతకవాఙ్మయమునకుఁ బునాదివంటిది. ఆంధ్రు లిది చదివినకొలఁది యింకను దీనిప్రాముఖ్యము తేటపడును.

పండితయ్యనుగూర్చి విశేషములు పాలుకురికి సోమన్న పండితారాధ్యచరిత్రమున నిట్లువ్రాసెను. చదువువారికి మనోహరముగనుండు న ట్లాతని ద్విపదలే యుదాహరించెదను.

శ్రీశైవసమయదేశకచక్రవర్తి ! పాశవిమోచనపటుకళామూర్తి
శుంభద్దిగంతవిశ్రుతసితకీర్తి | శాంభవదీక్షాభిజాతానువర్తి
ఉత్తమోత్తముఁడు సంయుతవీరభ క్తి | వృత్తచిత్తుఁడు చతుర్వేదార్థవేత్త
గహనసంసృతి శిరఃఖండన హేతు | మహితపంచాక్షరీమంత్రసిద్ధుండు
వేదాగమపురాణ విహితశాస్త్రోప | పాదితరుద్రాక్ష,భసితభూషణుఁడు
యమనియమాది వ్రతచారసార 1 శమదమోత్కృష్టనిష్ఠాగరిష్ఠుండు
నంతర్బహిర్ధ్యానయజనవంతుం డ | వాంతరయ్యయనంగహరగణాఢ్యుండు
వారిశిష్యుండు దుర్వారసంసార 1 దూరవీరవ్రతోద్దురవర్తనుండు
శైవధర్మోత్తమాచార్యుండు నతస | దైవంబునద్వైత తత్త్వతత్పరుడు
న్యాయవైశేషికోదాత్తశాస్త్రోప | పాయదర్శన పరిపాలనక్షముఁడు
స్వకృతావలోకనోత్సారితశిష్య ! నికరమలత్రయనిరపి తేంద్రియుఁడు
తంత్రాధిగతవీరతంత్ర స్వతంత్ర ! మంత్రాధిఘతరాజమంత్రసిద్ధుండు
వేద వేదాంతవివిధ పురాణోప | పాదితకేవలభక్తివర్ధనుఁడు