పుట:Shathaka-Kavula-Charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శతకకవులచరిత్రము


గినందున నది పోఁగొట్టుకొనుటకును, పరవాదిసంహరణదోషపరిహారము చేసికొనుటకును యీగ్రంథము వ్రాసె నని సిద్ధనంజేశుఁ డనుచున్నాఁడు. ఇందు ప్రమధగణ, రుద్రగణ, వృషభయోగాచార్యులు, అరువదిముగ్గురుభక్తులు, షోడశసుమతులు, దశగణ ప్రాచీనభక్తులు, మొదలగునామములు చెప్పియుండెను. (161--162 పుట.)

గణసహస్రనామము మహాపురుషులనామములే! అవి పండితారాధ్యచరిత్రమునందు సోమనాథుఁడు వ్రాసియున్నాఁడు. పేరులజాపితా యేభాషలో వ్రాసిన నేమి? అది యొకవేఱుకావ్యముగాఁ దలంప వీలులేదు. ఈతనిశైవవాఙ్మయము చేసినమార్పులు, ఉపకారములును ముందుముందుఁ జూచుకొనుచుఁ బోవుదము.

ఈపండితమల్లికార్జునుఁడే నన్నెచోడుని గురువగు మల్లికార్జునయోగి కావచ్చునని కొందఱుతలంచుచున్నారు. కుమారసంభవపీఠికలో నీవిషయము శ్రీ మా. రా. కవిగారు చర్చించి నన్నెచోడుని గురువు ముని యనియు, అస్ఖలితుఁ డనియు, బ్రహ్మచారి యనియుఁ జూపి, సంతానవంతుఁ డగుపండితయ్య నన్నెచోడునిగురువు కాఁజాలఁడని నిరూపించిరి. " పాల్కురికి సోముఁడు పండితమల్లయ యనియే సవిశేషముగాఁ జెప్పుచుండును. నన్నెచోడుఁ డెక్కడను మల్లి కార్డునునకుఁ బండితశబ్దమును జేర్చినవాఁడు కాడు” కావున పండితయ్య నన్నెచోడునిగురువు కాఁడని కవిగా రనిరి. ఈవాదములో సత్యము లేకపోలేదు. కాని పండితయ్య బ్రహ్మచారిగా నున్నప్పుడే నన్నెచోడుని గురువుగా నుండఁ గుమారసంభవము వ్రాయగూడదా? కుమారసంభవ మాశ్వాసాంతపద్యములలోఁ గవి గురువున కీక్రిందివిశేషము లున్నవి.

(1) శివతత్త్వజ్ఞానసన్మానను౯ 8. 195; (2) పరవాదీంద్ర ఘనాఘనానిలు; మహీసురేంద్రు 8. 197; (3) కవీంద్రు 9. 364; (4) బ్రహ్మకులాధీశుఁడు 10. 568; (5) అపరిమితవిద్యాపరిణతు 10. 780. (6} శివాగమవేది (7) అమోఘవచోనిధి 10. '781 (8) బ్రహ్మకులోత్తంసుఁడు (9) సంసార పదవియుక్తుండు 1008. a