పుట:Shathaka-Kavula-Charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శతకకవులచరిత్రము


భారతము నందలినలోపాఖ్యానాదులు బాలురకుఁ బఠనార్హములై బద్దెన, నన్నెచోడ, మల్లికార్జునులగ్రంథములు కాకపో నేల? కావున . నీకవుల శైలి కఠినము. అన్వయకాఠిన్య మున్నది. ప్రాతవడ్డరూపములు కలవు. ఐనను పండితుల కివి యనేకవిషయములలో నమృత ప్రాయమైన వనుట కెంతమాత్రము ననుమానము లేదు. ఒండేమి, వేయేమి, మొదలగు పదములయం దీతనికిఁ బ్రీతి మెండు. కులశబ్ద మీతఁడును .సత్కులుఁ డను నర్థమున స్పష్టముగఁ బదితావుల వాడి యున్నాఁడు. విప్లవము, పండుగ, పావలు, కసి, పినుగులు, పిండకూడు మొదలగుపదముల కీనాఁటియర్థమే యానాఁడునున్నది. వక్కఁడు, ఓడు, ఆలరి, ఎయిదఁడు, ఆలాపు, ముద్దటలడిఁచిన, పాదఱి, సూడుపట్టె, త్రిప్పటము, నొడ్డణము, ప్రువ్వులు, బడరుఁడు, మొదలగుపదము లిప్పు డపురూపము లైపోయినవి.

ఇతఁడు సంస్కృతవాక్యములు శ్రుతులనుండి పద్యమధ్యమున నెక్కువుగ నిమిడ్చియున్నాఁడు. ఈసంప్రదాయము శైవకవులలోఁ దరువాతఁగూడ నెక్కువుగఁ గనఁబడును. "ఓడునఁ బోసినజలంబు; మంటఁ గని సీతు వాసినకంటెను; మీస మెదుకుల మెఱపుల్," మొదలగులోకోక్తులఁ గొన్ని వాడియుండెను.

ఈతని యన్యమతఖండనభాగములు మిక్కిలికఠినవాక్యములతో నిండియున్నవి. కాని యీతఁడు ప్రతిపాదించినభక్తి యుత్తమమైనది. వైష్ణవవిశిష్టాద్వైతులవలెనే యీతఁడు నాయకనాయకీభావముతో గూడినప్రేమమునే జీవాత్మపరమాత్మలసంబంధముగాఁ బ్రకటించిన టీక్రింది పద్యములు జూపవచ్చును.

క. దురితహర మనియు శుభములు
   దొరకొను ననియును దలంచి దురితారి భవ
   చ్చరణాబ్జభక్తిలలనా
   పరవశభావమున నిన్ను బ్రణుతింతు శివా!!

భక్తి "లలనాపరవశభావమునఁ" బ్రణుతింతు ననుటలోఁ బండితున కీభావము సంపూర్ణముగ లేదనువా రున్నను పండితునిభక్తి