పుట:Shathaka-Kavula-Charitramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు.

11


వించుచున్నది. సంపూర్ణగ్రంథము చిక్కినప్పుడు దానిసత్యము తేలఁగలదు.

ఈతఁడు ప్రయోగించినపదజాలము, శైలి, కావ్యరీతులు నాకాలమునందుఁ బుట్టిన నన్నెచోడుని కుమారసంభవమునందును, బద్దెన నీతి సారముక్తావళియందును గనఁబడుచున్నవి. తిక్కనకంటె నిమిడికఁగ వ్రాసిన బద్దెనకందము లందముగ నున్న వని యొకసారి వ్రాసియుంటిని. ఆకాలమునాఁటి కందములసొగసు, వ్యర్థపదములులేమి, ఇమిడిక వ్రాఁతయు మన కీతనికావ్యమునందును బదర్శకమై నాఁటిసహజకవితా శక్తుల వెల్లడించుచున్నది.

పండితుఁడు పండితుఁడే యని చెప్పవలసినపనిలేదు. ఇతఁడు సంస్కృతభాషయందు వ్యాకరణము, తర్కము, వేదాంతము నభ్యసించుటయేగాక శ్రుతిస్మృతిపురాణవిజ్ఞాత యని యీతనిరచనమే వేనోళ్ళఁ జాటుచున్నది.

క|| పూని యతద్గుణసంవి
     జ్ఞానబహువ్రీహి మాన్పఁ జనుదెంచిన యణ్
     మానితషష్ఠీ తత్పురు
     షానూనసమాసమెఱుఁగ రజ్ఞులు రుద్రా!

క!! అమరఁగఁ బ్రపంచమిథ్యా
    త్వమ చెప్పెడువాది మున్ను దానికి సద్భా
    వము దానెఱుఁగక మిథ్యా
    త్వ మనాశ్రయ మెట్లు జెప్పఁదలపోయు శివా!

ఇట్టిక్లిష్టవిషయములఁ గూర్చి యింతయిమిడికఁగ వ్రాయఁగలపండితునిశక్తి యసాధరణ మైనదేకాని, మల్లికార్జునుఁడు వ్రాసినశైలి పామరులకుఁదెలియునది కాదు, ఇతనికావ్యము మఱుగుపడుటకుఁ గారణము సోమనాథాదులయనుకరణ మొకకొంతకావచ్చునుగాని యీతని రచనావిధానమునందును గొన్నిలోపములు లేకపోలేదు. ఆనాఁటి భాష యట్టి దనుకొంద మనిన నీతనికంటెఁ బూర్వఁడగు నన్నయ