పుట:Shathaka-Kavula-Charitramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

శతకకవులచరిత్రము


చాక్షరికిని జయ మగునిటలాశ్రయ మగుభసితంబునకును, జయమగుమాహేశ్వరులకు సతతము శివా" అని వ్రాసినదిచూడ షష్ఠ్యంతములు [1] వ్రాయుపద్ధతి తిక్కనకుఁబూర్వమే కలదని నిర్ణయమగుచున్నది. .

ఈతఁడువ్రాసినకావ్యమును స్థాలీపులాకన్యాయమున నించుక పరిశీలించెదముగాక ! గ్రంథారంభమున బ్రహ్మవిష్ణువులే నీమహిమ నెఱుఁగలే రనియైన" " శ్రీ పతివాక్పతిముఖ్య మహాపురుషులఁ” దలఁపెట్టి శ్రీకారముతోనే గ్రంథ మారంభించెను. మనకు దొరికినంతవఱకు గ్రంథములో నీక్రిందిపద్యములు శ్రీకారముతో నున్నవి. 1, 16, 71, 206, 299, 357, 359, 454, కృత్యాదిపద్యములుకొన్నితగ్గించి చూచినప్పుడీశ్రీకారములు కర్త నూఱేసిపద్యముల కొక్కటి వేసెనా యని యనుమానింప వీలగుచున్నది. లేఖకులు కొన్నిపద్యములు తారుమారు చేసియుండవచ్చును. 299వ పద్యము శ్రీకారముతో నారంభించి శివుని భృత్యులు గణాధిపతులను వారిచర్యలను వర్ణించుట కారంభించి 388 వ పద్యములో నిట్లు ఫలశ్రుతి చెప్పియున్నాఁడు.

క|| పరమేశ్వర నీ ప్రమథుల
    చరితలు సతతమును విన్నఁ జదివినఁ బ్రమథు
    స్మరణము చేసిన శుభములు
    దొరకొను దురితంబు లెల్లఁ దొలఁగు మహేశా||

388, 387 వపద్యములో దననామముకూడ చెప్పియున్నాడు

ఇట్లు ప్రత్యేకోపాఖ్యానములకు ఫలశ్రుతులు మనపురాణముల యం దుంట మనమెఱుఁగుదుము, కావునఁ బండితుఁడుకూడ నీప్రమథులచరిత్రము 87 పద్యములలోఁ గాక 100 పద్యములలోఁ జెప్పియుండునని నే ననుమానించుచున్నాను. నడుమఁ గారణము లేనిశ్రీకారము లయునికి యీగ్రంథ మీతఁడు నూఱేసిపద్యములో, నూటఎనిమిదేసి పద్యములో నియమ మేర్పఱచి వ్రాసియుండునని యనుమాన మొద

  1. ఇది రా. సా. గిడుగు రామమూర్తి పంతులుగారి తలంపు. నాకును బ్రమాణముగ నే తోఁచినది.