పుట:Shathaka-Kavula-Charitramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు

9


ఇతని గ్రంథమునందు శివనింద చేయువారినిఁ జంపవలె ననియు, నట్టి గ్రంథములను నాశన మొనర్పవలయు ననియు ఖండితముగ వ్రాసియుండెను. పాలుకురికి సోమన్నకూడ శివమతము నొందనివారిని రాజులసాయమున హింసించినట్లును గ్రంథములు చెప్పుచున్నవి. ఈ కాలమునందు బౌద్ధులను, బౌద్ధజైనవాఙ్మయములను శైవులునాశన మొనర్చిరి.

ఈతనిగ్రంథము సలక్షణముగ నన్నయాదులమార్గముననే వ్రాయఁబడినది. నన్నయ వాడినపదజూలమును పద్యలక్షణములు నిందున్నవి. కొన్నిరూపములు పండితునికాలమునాఁటి విశేషములఁ జూపుచున్నవి. పండితునకుఁ గర్ణాటక సంప్రదాయానుసారము “వలపల గిలక ప్రాస" మిష్ట మని శ్రీలక్ష్మణరావుపంతులుగారు సెల విచ్చి యున్నారు. ఈసంప్రదాయము కర్ణాటాంధ్రభాషలఁ గవిత్వముచెప్పినవారికేగాక యితరాంధ్రకవులయందును గానవచ్చెడిని.

“అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖికం
 చెర్లకులోద్భవుండు” దాశరధీశతకము.

ఇచ్చట “ర్ల” యింటిపేరులోని దగుట "కంచెల్ల"కుల మని రూపాంతర మంగీకరింప వీలులేదు. కావున తెలుఁగుకవులే యీప్రాసమును గన్నడములోనికి బంపియుందురు. ఇది మనలాక్షణికులలోఁ గొందఱు చర్చించియున్నారు. శబ్దశాస్త్రము ననుసరించి సాధువే

ఈగ్రంథము నన్నయ తిక్కన్నలకు నడుమపుట్టినది. నన్నె చోడునికావ్యమీకాలము నందలిదే యైయుండు నని శ్రీ వీరేశలింగము పంతులుగారు క్రొత్తకూర్పుకవిచరిత్రములో వ్రాసిరి కాని తెలుఁగు కావ్యములలోఁ దిక్కన్నయే వష్ఠ్యంతములు మొదటవ్రాసినవాఁ డనుసిద్ధాంత మందువలనఁ బోవుటకు వారర్ధాంగీకారమునే వెల్లడించిరి. కాని యీశివతత్త్వసారమునందుఁ గృత్యాదికిఁ జివర 18,19, 20 పద్యములుమూఁడుమాత్రము "జయ మగు వేదంబులకును జయ మగుఁబం