పుట:Shathaka-Kavula-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు

5


చూపెదను. కాని వేమన్న శివభక్తికలిగియుఁ బండితునివలెఁగాక కేవలాద్వైతభావముల వెల్లడించెను.

క|| నిన్నెఱుఁగుచు దన్నెఱుఁగని
    యన్నఁడు శివయోగమగ్ను డనఁబడు(మదిలో)
    నిన్నును దన్ను నెఱింగెడి
    యన్నఁడు శివయోగమగ్నుఁ డనఁబడును శివా.
                                                    --శివతత్త్వసారము 269.

తే|| నిన్నుఁ జూచెనేని తన్నుఁదా మఱచును
      తన్నుఁ జూచెనేని నిన్ను మఱచు
      నేవిధముగ జనుఁడు నెఱుఁగు నిన్నునుఁ దన్ను
      విశ్వదాభిరామ వినుర వేమ!!
                                      - 135 ఫుట " వేమన్న " 1922.

ఇంకను వేమన్న వాడిన "లలితశివతత్త్వపదమున” మొదలగు వాక్యము లనేకము లాతఁ డీగ్రంథము చదివి ఛాయల మెఱుఁగుపెట్టి గ్రహించెనని చూపవచ్చును. సోమనాథుని యనుకరణములకు శివతత్త్వసారమునందలి 387, 386 పద్యములతోఁ బండితారాధ్యచరిత్రము పర్వతప్రకరణము 405 పుట పోల్చికాని, శివతత్త్వసారమునకు శ్రీలక్ష్మణరావుపంతులుగారి పీఠికచదివిగాని చూడవచ్చును.

ఇట్లనేకప్రసిద్దాంధ్రకవులకు బిచ్చమువెట్టిన యీమహాకవి గ్రంథభాగ మిప్పటికైనఁ బ్రకటనమొందుట వాజ్మయప్రియులయదృష్టవిశేషమనుట యతిశయోక్తి కాదు. పండితునికాలమునుండియు నీ గ్రంథము శైవులలో మిక్కిలివ్యాప్తిలో నుండెను.

సోమకవి పండితారాధ్యచరిత్రమునం దీకవి యనేకేతరగ్రంథములు వ్రాసినట్లు మహిమాప్రకరణమునందుఁ జెప్పియున్నాడు. అవి లింగోద్భవదేవుగద్యము, రుద్రమహిమ, గణసహస్రమాల, అమరేశ్వరాష్టకము, పర్వతవర్ణనము ననునవి. ఇతఁడు కర్ణాటకభాషలో గణనహస్రనామము, ఇష్టలింగస్తోత్రము, బసవగీతలు ననుగ్రంథములు రచి