పుట:Shathaka-Kavula-Charitramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

శతకకవులచరిత్రము

“కం|| ఆయతి త్రిపురాంతక దే
        వా యని పిలుచుటయుఁ గటక మంతయు వినఁగాఁ
        బాయక కిన్నర బమ్మయ
        కోయని యెలుగీవె తొల్లి యురగాభరణా!!"

ఈయూహ కవి శివతత్త్వసారమును సహస్రముగా వ్రాసియుండు నను నాయూహకు బలమిచ్చుచున్న ది.

ఈకవిని "పండితారాధ్యు”లని "ఆరాధ్య దేవర ” యని “మల్లికార్జునుఁ" డని "పండితయ్య”యని పలువిధములఁ బిలిచెదరు. పాలుకురికి సోమన్న పలుమారు పండితారాధ్యు లీగ్రంథము వ్రాసెనని చెప్పుటచేఁబ్రసిద్ధు లగుపండితులవారే యీగ్రంథమువ్రాసి రని నిర్ధారణ మగుచున్నది.

(1) "శివతత్త్వసారసంచిత మహమహిమ
     శివతత్వసార దున్శిచకృతిఁ బొగడు
                                          -దీక్షా ప్ర. పుట 62,

(2) శతకంబు శివతత్త్వసార మాదిగను
    గద్యపద్యంబు లాకాంక్షఁ జదువుచును
                                           -వాద ప్ర.పు 173.

(3)గీ. ఎట్టులనుచు సంశయింపక శివతత్త్వ
        సారగద్యపద్య సమితి శివుని
        మహిమ తెల్పునట్టిమల్లికార్జునపండి
       తయ్యగారిఁ దలఁతు ననుదినంబు”
                                            -అనుభవసారము.

ఇట్లు పాలుకురికి సోమన్న పండితులవా రీగ్రంథములు వ్రాసినట్లు చెప్పుటయేగాక యితని కందపద్యము లనేకము లాతఁ డనుకరించి యున్నాఁడు. ఒక్క సోమనాథుఁడే యన నేల? ఆకాలమునందలిశైవకవు లందఱు నట్లొనర్చినవారే! ఇందలి 338 పద్యముతోనన్యవాదకోలాహము నందలి 73వ పద్య మొకటిపోల్చిచూచిన సత్యము వెల్లడియగును, వేమన్న చరిత్రమునం దీతనిగ్రంథము వేమన్న చదివియుండు నని వ్రాసియుంటిని. ఇటీవలఁగొన్నిపద్యము లాతఁ డనుకరించినవి కనఁబడినవి. మచ్చు