పుట:Shathaka-Kavula-Charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు.

3


రాధ్యచరిత్ర మని పాల్కురికి సోమనాథుఁడు ద్విపదలో రచియించి యున్నట్లు మన మెఱుఁగుదుము. అదిగాక పిడుపర్తి సోమనాథుఁడు బసవపురాణమునం దిట్లుచెప్పియున్నాఁడు.

"సీ. విరచించె జైమిని వేదపాదస్తవం
                  బొకపాదమున వేదయుక్తి నిలిపి
      హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పెఁ
                  బ్రతిభ సోమేశుఁ డారాధ్యచరత
      సరవి శ్రీనాథు: డాచరిత పద్యప్రబం
                 ధము చేసె ద్విపదలు తఱచునిలిపి "

కావున శ్రీనాథాదులుకూడ నీపండితారాధ్యచరిత్రము వ్రాసినట్లు కనఁబడుచున్నది. ఈగ్రంథము లన్నియు మనశివతత్త్వసారప్రణీత యగు మహాకవిపండితారాధ్యులచరిత్రములే! ఇట్టి చరిత్రములలో మొట్టమొదటిదైన పాలుకురికి సోమన్నగ్రంథమునం దీశివతత్త్వసారము శతక మనియే యుండెను.

"ద్వి|| శతకంబు శివతత్త్వసారము దీప
       కళికమహానాటకము నుదాహరణ||"
                                  -పర్వతప్రకరణము (369).

ఈపాదములకు "శతకమును శివతత్వసార మునుగూడఁ జేసి యుండవచ్చుననియు, శివతత్త్వసార మందువలన శతకము కానక్కఱలే"దనియుఁ గొంద ఱందురుకాని యదియే సిద్ధాంత మనుట కట్టివా రీకవి వ్రాసినశతకమును జూపవలసియుందురు. ఈశతకము మసకిప్పటి వఱకుఁ దెలియకయున్నను పూర్వలాక్షణికు లీగ్రంథము నెఱిఁగియున్నట్లు (1) గణపవరపు వేంకటకవిప్రయోగరత్నాకరము (2) అనందరంగరాట్ఛందము నిందలి పద్యముల నుదాహరించియుండుటచే సాక్ష్య మిచ్చుచున్నవి. అందుదాహృత మైనయీక్రిందిపద్యము ప్రస్తుతము . శ్రీలక్ష్మణరావుగారు ప్రకటించిన శివతత్త్వసారమునందు లేనందున నిందలిపద్యము లింకను నుండియుండవలె నని వా రూహించుచున్నారు,