పుట:Shathaka-Kavula-Charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxviii)


ము మన యతిప్రాసనియమములయందలి రహస్యముపై నాధారపడి యున్నది. మకుట మొకటిపద్యముల కన్నిఁటికి స్థిరముగ నుండవలసివచ్చుటచే నొక శతకమునందలి పద్యము లన్నియు సంస్కృతకావ్యముల యందలి సర్గలవలె నొకేతీరుపద్యములతో వ్రాయవలసియుండెను ఉత్పల చంపకమాలల వంటి యన్యోన్య సంబంధముగల పద్యములు మాత్రము మారుచుండుట గలదు. కాళహస్తీశ్వరశతకమునందు మత్తేభశార్దూలములు, భాస్కరశతకమునం దుత్పల చంపకమాలలు దాశరథీశతకమునందు నట్లే యొకటి రెండు వృత్తములలోఁ జెప్పవలసివచ్చినది. సూక్ష్మమగు నీతులు సులభమైనశైలిలోఁ దేట తెలుఁగు పదములతో వ్రాసిన కొందఱుశతకకర్తలు నీతి, వేదాంతముల కాటవెలఁది కందపద్యములవంటి జాతుల నాశ్రయించిరి. కందపద్యము నీతిశతక కవులకుఁ బ్రీతికర మని తోఁచుచున్నది. సులభముగ బాలురు బాలికలు చదువుటకు, నందఱకు జ్ఞప్తియందుంచుకొనుటకును, వీరీ కందము నాశ్రయించి రనుకొందును. నీతిపద్యముల కీకందములందముగ నున్నవి. కందము చెప్పినఁగాని కవి కాఁడనుటవలననే తెలుఁగుభాష కీజాతిపద్యము ప్రాముఖ్యమని ప్రచురము కాఁగలదు. తిక్కన భారతము శాంతిపర్వములో నీకందమును జక్కగ వాడియున్నాఁడు. అందువలననే కవిచౌడప్ప యిట్లుపలికెను.

“ముందుగ చనుదినములలో, కందమునకు సోమయాజి ఘనుఁడందురు నే
 డందఱు ననుఘునుఁడందురు, కందమునకుఁ గుందవరపు కవిచౌడప్ప!"

చౌడప్పకూడఁ గందమునకు ఘనుఁడనుట సత్యేతరము కాదు కాని మకుటముకొఱకు నాల్గవపాదము మొదటికి 'కి' కారమును దెచ్చి కవి పైపద్యమునందలి వాక్యక్రమము నెట్లు మార్పవలసివచ్చెనో చూచెదరుగాక! కావున మకుటము శతకస్వరూపమును నిర్ణయించుటకు ముఖ్యకారణ మైనది.

భక్తిశతకములు వృత్తమయములు రాగాలాపనము చేసి భక్తులు పాడుకొనుట కిది రమ్య మని యట్లొనరించి యుండవచ్చును. శృం