పుట:Shathaka-Kavula-Charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxiii)


మును వారు మానియుండరు. అనేకప్రబంధముల నామూలాగ్రముగఁ జదివిన సీతారామాచార్యులుగారుకాని, ఎన్నో గంథపీఠికలును, గద్యలను జదివి, బ్రౌనుగారి గ్రంథచరిత్రములఁ బరిశీలించి, కవిచరిత్రము వ్రాసిన శ్రీవీరేశలింగముపంతులు గారకాని ప్రయోగముల నీయలేరా? శతకకవులనుఁగూర్చి వ్రాయలేకపోవుదురా? వారిది యనవసర మని తలంచిరి. తప్పు లధిక మని విడిచిరి. ప్రౌఢప్రబంధములే సత్యమైన వాఙ్మయ మనుకొనిరి. అందు లేనిప్రయోగములకుఁ బదముల కే నిఘంటువులో స్వల్పముగ గేయశతకవాఙ్మయసాయము నందిరి.

శతకములపై శ్రీ వీరేశలింగము పంతులుగారి కంతగా గౌరవములేదనుట కాధారముగా వారివాక్యములే చూపనగును. కాని యదియిచ్చట నవసరములేదు, అయినను సందియమున్నవారు వారి కవుల చరిత్రమునందలి 400, 396, 397, 393 పుటలఁ జూడవచ్చును కూచిమంచి తిమ్మకవి "మఱియుఁ బెక్కుశతకదండకసత్కృతుల్ ప్రతిభఁగూర్చి” యని చెప్పుకొనుచుండఁగా శ్రీ వీరేశలింగముపంతులుగా రవియన్నియు బాల్యకృతము లగు చిన్నకృతు లని యాతనిసారంగధరచరిత్రముతోపాటుగా త్రోసివేసిరి. తిమ్మకవి కుక్కుటేశ్వరశతకము ముందఱ నాతని యితరగ్రంథములు పేర్కొనుటకైన నర్హతలేని వని విజ్జులకుఁ దెలియనివిషయముకాదు. "సత్కవితామహాసామ్రాజ్య భారధౌరేయుండ బుధజనప్రియసచివుంది” నను తిమ్మ కవిశతకమునందలి వాక్య మాతఁ డాశతకము బాల్యమున వ్రాసెననియే తోఁచిన శ్రీ వీరేశలింగముపంతులుగారి నేమనఁగలము? ఇట్లే సూరకవి రామలింగేశ్వరశతకము, ధూర్జటి కాళహస్తీశ్వరశతకమును గూడఁ బ్రౌఢవయస్సుననే వ్రాసినట్లు "రోసిందేమిటి రోత "అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె” “కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు” “ రాజుల్మత్తులువారి సేవనరకప్రాయంబు” “ఎన్నాళ్లుండితి నేమిగంటి నిఁకనే నెవ్వారి రక్షించెద౯ " మొదలగు వాక్యములచేఁ దెలియుచున్నది. నఱసినవెండ్రుకలప్రక్క వెండితీఁగెల రుద్రాక్ష లల్లాడుచుండ ధూర్జటి యాపద్యములు చదువుచు