పుట:Shathaka-Kavula-Charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxii)


రామబాణములనుక్రిములకు నప్పగింపఁదగినదో, మనమే పుస్తకక్రిములమై వానిదుమ్ము దులిపి యందలిగుణమును గొనియాడఁదగినదో విచారించెదరుగాక ! శతకములలోఁగవిత్రయ ప్రయోగవైరుధ్యములు కొన్ని యున్నసు, తేట తెలుఁగుసొంపులు కొన్నియట్టిచోటులనే రససమంజసములై వాడుక భాషావాదులవాదమునకు బలమును గలుగఁజేసి, శబ్దసిద్ది లోకమువలనఁ దెలియవలె ననుసిద్ధాంతము నందలి న్యాయమును వెల్లడించుచున్నవి. ప్రయో మూలము వ్యాకరణ మగుట నట్టిప్రౌఢప్రయోగముల తారతమ్యముచొప్పున మన వ్యాకరణము కొంతవఱకు సవరించుకొనుట న్యాయ మని నేనుఁ దలంచుచున్నాను.

ఇదివఱకువారు శతకములఁగూర్చి వ్రాయలేదనియు, నేనిప్పుడు వ్రాయుచున్నాననియు, నందువలన నేను వారికంటె ఘనుఁడననియు నేనీవాక్యములు వ్రాయుటలేదు. అట్టి దుష్టాభిప్రాయము నాకుండినను లోకమును మోసగించి నేనట్టిసాహసమున కొడిగట్టినను లోక మూరకొనదు. పైన నేనుచూపిన భావములు పెద్ద లనేకు లంగీకరించుచున్నారు. వ్యాకరణసంస్కరణము, శతకములయాదరణము నవసరమనుచున్నారు. కాని యెవ్వరు నాపనుల కింతవఱకు నాకుఁ దెలిసినంతలోఁ బూనుకొనలేదు. ఒకశతకము మంచిదని మనకు సత్యముగఁ దోఁచినప్పుడు ఒక ప్రయోగము బహుళమై కవిత్రయప్రయోగములకు విరుద్దమయ్యు రసప్రకటనమున కనువైయున్నట్లు మన కగ పడినప్పుడు మనమది లోకమునకుఁజూపి చెప్పవలెను. ఆవిధముగఁ బ్రయోగించి భావప్రకటనమునకు, రసస్ఫూర్తికి, భాషాసౌలభ్యమునకుఁ దోడ్పడవలెను. ఇది భాషాభివృద్ధి చేయుటకాని, భాషాభివృద్ధి కావలె నని యెవరితెన్నున వా రూరకుండిన నగునా! విద్యాధికులైన వారు తమకు సత్యము లని తోఁచినవిషయములు మాబోంట్లకు వెల్లడించుచుండవలదా?

ఇదివఱకు మన పెద్దలు శతకకవులను విస్మరించినమాట సత్యము అది వా రుద్దేశపూర్వకముగ విస్మరించిరి. చేతఁగాక యీ స్వల్పకార్య