పుట:Shathaka-Kavula-Charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxx)


ము కాసుల పురుషోత్తమునియాంధ్రనాయకశతకము, కవిచౌడప్పశతకము, వేమనశతకము, నీయఁజాల వనగఁలమా? తెలుఁగుపలుకు బడులకు శతకములకంటె మంచిపద్యగ్రంథములు లేవనియే నామతము. ఇవి పాటలంతవివర్ణపదసంకలితములు కావు. శబ్దశాస్త్ర సిద్ది లేనివికావు. శతకకవులు లాక్షణికులు కారందుమా? పాలుకురికి సోమన్న బసవపురాణము లాక్షణికమై దానికిఁ బిమ్మట వ్రాసినవృషాధిపశతకము వికృతమైన దనవచ్చునా? కవిసంశయవిచ్ఛేదము వ్రాసినలాక్షణికుఁ డగుసూరకవి రామలింగేశశతకము గడ్డితుక్కయి, కవి జనరంజనము ఘనమైన దయినదా? ఆంధ్రనామశేష మాదరణపాత్రమై శతకము, హితవుకాకపోయిసదా? అప్పకవివజ్రపంజరశతకాదుల లాక్షణికముగ నెంచలేదా? రావిపాటితిప్పన్నచాటుధారలు, మేధావి భట్టుపద్యములు లాక్షణికములు కాఁగా, కావ్యగౌరవము గలశతకములు పనికిరాకపోవుట న్యాయమా? ధూర్జటికాళహస్తిమాహాత్మ్యము పనికివచ్చి, తరువాత ప్రౌఢవయస్సున వ్రాసిన కాళహస్తీశ్వరశతకము గౌరవార్హత లేనిదైనదా? శతకములవంటి చిన్నగ్రంథములు వ్రాసిన గట్టుప్రభువు గట్టివాఁడైనాఁడు? లాక్షణికుఁ డైనకూచిమంచి తిమ్మకవి,[సర్వలక్షణ సారసంగ్రహకర్త] వ్రాసినకుక్కు. టేశ్వరశతకము, కుకవిత్వమా? ప్రబంధమార్గములు ప్రాఁతవి సమకూర్చిన రుక్మిణీపరిణయాదులు ప్రౌఢగ్రంథములా? ఇది వింతగా లేదా?

మీకొక్క యుదాహరణము చూపెదను. శ్రీవడ్డాది సుబ్బారాయుడుగారు మంచిపండితులు, కవులు నని లోక మెఱుఁగును. వారనేక పెద్దగ్రంథములు వ్రాసినారు. భాషాంతరీకరించినారు. కాని వాని యం దెల్లయెడల వారిపాండిత్య, భాషాంతరీకరణ నైపుణ్యము వెల్లడి యైయుండవచ్చును. కాని వారిభక్తచింతామణి పండితపామరప్రియమైనది. ఇది యుపజ్ఞాసహిత మగుస్వకల్పితా కావ్యముకదా! ఇదిశతక స్వభావము కలది. అది పెక్కుమార్లు పునర్ముద్రిత మైనది; వేనవేలు ప్రతులు చెల్లిపోవుచున్నవి. తక్కిన - వారివే - యితరగ్రంథములు రెండుమూఁడు ముద్రణములు దాటియుండవు. కారణమేమి? గ్రంథ