పుట:Shathaka-Kavula-Charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxviii)

విన్నకోట పెద్దన్నగారు లౌక్యము చేయుచున్నారు. వినుఁడు. ఆయనకూడ నప్పకవిగారిమార్గమునే యనుసరించి శతకాదులు క్షుద్రకావ్యములని నిర్ణయించినాఁడు. క్షుద్రకావ్యము లఁనగా, సల్పకావ్యములు, ఖండకావ్యములు ననుటకుఁ బర్యాయపదముగా వాడిరనిన నా కాక్షేపము లేదు. అవి నీచకావ్యము లను భావముండిన నది తప్పని చెప్పవచ్చును. పెద్దన్నగారు “ఒకపాటి గంతచాటు చాటు కృతులకు మెచ్చునే, విశ్వేశచక్రవర్తి" అని చక్రవాళ, దండక, మంజరి, రగడ, గుచ్ఛము లాదిగాఁగల కావ్యములు హెచ్చుగుణము గలవిగ నుండవలె ననెను. గుణములేని దెవ్వరును మెచ్చరు. ప్రబంధాదులుమాత్రము గుణ ముండనివి మెచ్చుచున్నామా? శతకములన్నియు మంచివన మనుచున్నామా? కాదు. మన లాక్షణికులు "కావ్య తత్త్వము బాగుగ వివరింపలేదని మనవి చేయుచున్నాను. అప్పకవి పై పద్యమునకు వ్యతిరేకముగఁ మఱలఁ జెప్పుచున్నాడు.

క. కనుగొన సంఖ్యాబద్ధం, బుస సంఖ్యాకంబు నాఁగభువి నిరుదెఱఁగై
   తనరారుఁ బూర్వకవిమత, మననాచాటు ప్రబంధములు జలజాక్ష. 1-132

తే. నాల్గుదెగల యదాహరణముల ముక్త, కాది పంచాదశమును సంఖ్యాన్వితములు
    గద్య రగడ ద్విపద దండకములు మంజరులును, సంఖ్యారహితచాటువులు నృసింహ.
                                                                                                            1-133

వ. ముక్తకాది పంచాదశ త్తెట్టి దనిన,

సీ. ఒనరు ముక్తకమన నొక్కవద్యము ద్వికం, బగు రెండుత్రికముమూ డైనఁ బంచ
    రత్నంబులైదు వారణమాలయెనిమిది. నవరత్నములు పద్యనవకమైన
    భాస్కరమాలిక పండ్రెండు శశికళ, పదియాఱు నక్షత్రపంక్తియిరువ
    దియునేడు త్రింశద్వాహయయు ముప్పది, రాగసంఖ్య వెండియు రెండుసాగెనేని

తే. వరుసపంచాదశాఖ్య మవ్వలశతకము, నష్టసమధిక శతకంబు ననఁగ వెలయు
    నేఁబదియునూరు నూటిపై నెనిమిదియును, సప్తశతి సప్తశతమై శార్జపాణి. 1.134

ఈతనికిఁ బూర్వుఁడగు ననంతామాత్యుఁడు తన ఛందములో జాటు ప్రబంధలక్షణ మిట్లు చెప్పినాఁడు,