పుట:Shathaka-Kavula-Charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxi)


"శా. ఆకర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబున౯
      నాకావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా
      నీకుం బద్యములిచ్చుచో నిపుడు వాణీ దవి నాజిహ్వకు౯
      రాకుండ౯ వసియించు టెట్లు రఘువీరా! జానకీనాయకా!!” 2

స్వతంత్రప్రయోగము లధికములు. భావము లింతకుఁ బూర్వపు శతకములలో నున్నవానికంటె మిన్నకావు. కొన్ని మిరియములవంటి పద్యము లున్నమాట సత్యము, కణా౯టక రాజుల కావ్యపోషణము ప్రసిద్ధము. ఇతఁడు రామభద్రునితాత యగుట వీరనరసింహునికాలమునఁగాని, కృష్ణరాయనితండ్రికాలమునఁగాని జీవించియుండవలెను. ఈతనిగౌరవించినక ణా౯టకమండలాధిపతి నరసింహరాయఁడో వీరనరసింహరాయఁడో తెలియదు. వీరనరసింహునికాలమున రాధామాధవుఁ డుండెను. బహుశః తిప్పయయు నీతఁడును సమకాలికులు కావచ్చును. పోతనామాత్యుఁడుకూడ నాలెక్కప్రకారము వీరికి సమకాలికుఁ డైయుండవలెను. లేదా కొంచెముపూర్వుఁ డైయుండవలెను. ఇప్పటి భాగవతము, నారాయణశతకము, జానకీవరశతకము, రాధామాధవ విలాసము, తారకబ్రహ్మరాజీయమునుగూడఁ గణా౯టకరాజ్య పరిసరప్రదేశములనేగాక దేశమునల్గడల వైష్ణవప్రాబల్యమును సూచించుచున్నవి. ఈకాలమునందే యున్నప్రబోధచంద్రోదయకర్తలు శైవులు. వారికిఁ కొంచెముతరువాత వాఁడగుధూర్జటి శైవుఁడు. పినవీరన్న శైవుడు. కావున శైవులు లేకపోలేదు. వైష్ణపము ప్రబలముగ నున్న దనిమాత్రమే చెప్పవీ లగుచున్నది. శతకములును వైష్ణవమత ప్రతిపాదకముగ బయలుదేరినవి. శ్రీనాథుఁ డింతకుఁబూర్వము రచియించిన శాలివాహన సప్తశతి చిక్కుటలేదు. ఇతఁడును శైవుఁడేకాని శాలివాహనసస్తశతి భాషాంతరీకరణ మగుట నందు శైవమతప్రమేయ ముండకపోవచ్చును.

ఇఁక గృష్ణరాయనికాలమునుండియు వచ్చిన శతకములఁ బరిశీలింప దొరకొనిన ధూర్జటి కాళహస్తీశ్వరశతకమే ముందుగఁ గనఁబడు చున్నది. ఇందు శివానందలహరి సర్వేశ్వరశతకములఛాయలు కనఁ