పుట:Shathaka-Kavula-Charitramu.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పారనంది సర్వేశ్వరశాస్త్రి


ఈతఁ డీబాహ్మపురి వేంకటేశ్వరశతకము నొక్క వాసరములోఁ జెప్పఁగలిగితి నని వ్రాసెను. ఆత్మకూరి భామన, ఆదినారాయణ శెట్టి వేంకటరంగములకు శతశాంతమున నాశీర్వాదము లున్నవి. బాలకులకు, భక్తులకు నీశతక ముద్దేశించి కవి వ్రాసెను. ఇందలి బ్రహ్మపుర మెచ్చట నున్నది తెలియదు. కవిత్వము లలితముగ నున్నది. ఈకవి 1840 క్రీ. శ. నకుఁ బూర్వుఁ డై యుండవచ్చును. శైలికిఁ బద్యములు చూపెదను.

బ్రహ్మపురి వేంకటేశ్వరశతకము.

క. శ్రేయః ప్రాప్తికి సాధన, మాయుర్వర్తనము నీపదార్చన వరణ
యక రా న్యా యపగా, పొయహరా! వేంక టేశ బ్రహ్మ పురీశా!!

క . ఏ పాదము లోకత్రయి, వ్యాపించియు సుతలమందు బలిదను జేంద్రం
బ్రషించెఁ డత్పిదం బే, ప్రొపగు శ్రీ పేలక టేశ బ్రహ్మపురీశా!

క. కౌమోదకి సందక ముల, నామోదముతోడఁ దాల్చి యరినికరంబుజా
వేమాయింప వేనత సు, త్రామా! శ్రీ వేంక టేశ! బ్రహ్మ పురీశా !!!

క. సయమున నాదాయములో, వ్యయమును దశమాంశఁజేసి వసుమతిలో
ద్వ్య యిసుఖమును యశమునుగను, రయమున శ్రీ వేంకటేశ! బ్రహ్మ పురీశా! -

క. నీచులతో సాంగత్యము, త్రాచులతోఁ జిలుకులాట తగదని మదినా
లోచింప వలయుఁ బాలీశ, వాచస్పతి! వేంక టేశ! బ్రహ్మ పురీశా!


బహుజనపల్లి సీతారామాచారి


ఇతఁడు సుందరరాజశతకము వినాయకశతకమునుగూడ వ్రాసెను, గొప్ప పండితుఁడు. శబ్దరత్నాకర మనునిఘంటుకర్త. ఈశతకము 1847 క్రీ. శ. వ్రాసెను. ఇతఁడు "నాగపట్టణ” పురవాసి "అం

377