పుట:Shathaka-Kavula-Charitramu.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

329 శతక కవుల చరితము,


వ్రాయనారంభించి క్రమముగా బాలిక పెద్దదై భర్తనుచేరి బిడ్డలకై వ్రతము లాచరించి, గర్భిణీయై కష్టములఁబడి, కని, పెంచి, పెద్దవానినిఁ జేసి మనుమల నెత్తువఱకు నుండు మాతృమూర్తి మహాప్రేమమును ద్రాక్షేక్షురసముల జిలుకుపద్యములతోను, ప్రేమమూర్తి యగుమాతృదేవత నిశ్చలస్వరూపము భావగోచర మగు మేథాశక్తి తోడను హౌసియున్నాడు. సృష్టికిఁ గారణ మగు స్త్రీ జాతి మాతృత్త్వ ముసు గోరుకోక (instinct) యెంత స్వభావసిద్ధ మైన దని జీవశాస్త్ర కారులు మనకు బోధించినను, మనసార మాతృ దేవతను బూజింపఁగలి గిన సృష్టి, తల్లికిని బిడ్డతును గలసంబంధము • టెస్టుట్యూబు' వలనఁ పరీ &ంపదగిన దని (ప్రకృతియే) యంగీక రింపదు. “అమ్మ” అనుపగము నందలి మాధుర్యము బహుశః, అభావముగలవారి కెక్కువ తెలియు నా? ఆవుదూడకూడ "అంబా” యని బిలువఁగలదు. క్రిమికీటకాదుల యందుఁగూడ మాతృ ప్రేమము ద్యోతక మగును. తల్లి సాధువుగా సుండునది 'యైనను, బిడ్డయందలి ప్రేమకొఱకు ప్రాణములు తృణప్రా యముగ నిచ్చి వేయును. పరమసాధు వగుగోవు, బడి తెచూపిన పారీ పోవుపంది, అతివిశ్వాసము గలకుక్క, మనుష్యునిఁ జేరనికోడి, అవి యెల్లప్పుడును మనుష్యునికి భయపడునవి. పిరికి స్వభావము 7.లిగి ప్రాణ రక్షణమునకుఁ బారిపోవు స్వభావ మెచ్చుగఁ గలవికూడఁ బిల్లలఁగన్న యప్పుడు ప్రాణములకుఁ దెగించి యెదుర్కొనును. ఈ సినపులి భయం కర మనుసామెత మన మెఱుఁగనిది కాదు. కొవున సంతాసకొఱకుఁ బిరిజా తిజంతువులుకూడఁ బాణము లర్పించు నను భావమే ముఖ్యమై నది. ఇచ్చట నాయనుభవములో సున్న యొక కథ వాయవలసియుం డెఁ గాని మాతృ ప్రేమము—బిడ్డలఁ గనుకోరక లో స్త్రీలకుండు సహజ వాంఛ ఋజువు చేయవలసి సభారమునా పై వేసికొన నగత్యము లేదని శతక పద్యములే కొన్ని చూపెదను.

చ. చిరుతతనంబునర్ లలఁ జేరి విహారము సల్పు వేళ నా
దరమునఁ గొయ్య బొమ్మను ముదంబునఁ బుక్రునిగాఁ దలంచితాయి