పుట:Shathaka-Kavula-Charitramu.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్తూరి అప్పావు మొదలి


కవులచరిత్రమువలన శుద్ధద్రావిడుఁ డగు త్యాగరాజ మొదలి మిక్కిలి సమర్థతతో వ్రాసిన సుబ్రహ్మణ్య విజయాది గ్రంథములను గూర్చి మనము వినియున్నాము. అన్యదేశమువా డగుకవి మనభాష నభ్యసించి యందుమాతృభాషగాఁ గలమనకంటె మనోహరముగ వ్రాయఁగలశక్తి నార్జించుట సామాన్యవిషయముకాదు. తెలుఁగుభాష తేనెల తెరలవంటి మధురభాష యగుటచేతనే ద్రావిడులు, కర్ణాటకులు, మహారాష్ట్రులునుగూడ మనభాషలోఁగావ్యములు వాసినట్లును మనకావ్యముల భాషాంతరీకరించుకొనుచున్నట్లును దెలిసికొనఁగలము. మనభాష యన్యులకు సులభముగఁ బట్టుపడును. మహారాష్ట్రుఁ డగుచిదంబరకవికూడఁ దనయంగదరాయబారముకావ్యమునందు మనభాష మాధుర్యమే తానీభాషలోఁ గావ్యమువాయుటకుఁ గారణ మని వ్రాసె నని విందుము. ఇందువలన మనభాష యభ్యసించుట పరులకు సులభసాధ్యమని తేటబడుచున్నది. అనేక భాషలభ్యసించిన మనవారు చెన్నపురిలోఁ జిరకాలముండియుఁగూడ నఱవమును వ్రాయలేకయున్నారు. ప్రస్తుతాంశ మగుమనయప్పావు మొదలి మనకందఱకుఁ బ్రీతికరమైన "మాతృశతకము” నతిరసవంతముగ వాసియున్నాఁడు. ఈకవి శతకమునం దీక్రింది వివరములఁ జెప్పుకొనెను.

ఉ. శ్రీ వెలయుగ లోకులిపే చిత్రమటంచు మదిం దలంప న
ప్పొ పతిభ క్తితో జనని పైఁ గల ప్రేమ దుకంగలించి రాగ
గా వగమిత మాతృశతకం బొనగూరిగేఁ గానఁ జూచినం
బూబలు కానిఁ గన్న సీకఁ బోలిన "బ్లీనిఁ బోల రెవ్వరు. 100

ఈతఁడు కన్నెలు పసివయస్సునుండియు బిడ్డలఁ గనవలె నను దై ననియమిత మగుకోరికకు (instinct) పాలగుదు రని శిశువులుగానున్న రెండు మూఁడేండ్ల బాలికలవనుస్సునుండి వారి కుండుతల్లిభావమును

370