పుట:Shathaka-Kavula-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xviii)


కము సర్వేస్వరశతకమును రమ్యమయినవి. వృషాధిపశతకము. జాను తెనుఁగు మొదలగుభాషావిశేషములఁ జర్పించుకొనుట కనువైనది. సర్వేశ్వరశతకమున భావములు భక్తిప్రధానము లైయున్నవి. కొన్నికవిత్రయప్రయోగములకు విరుద్ధముగ భాషావిశేషములు కనఁబడుచున్నవి. ప్రాకృతములో బౌద్ధ, జైనవాఙ్మయములయందలిశతకములు శైవులవలనఁ దెలుఁగులోనికిఁ బ్రాకినట్లు తోఁచుచున్నది; జైనదేవాలయము లనేకములు శైవు లాక్రమించినట్లే, వారిప్రాకృతవాఙ్మయము వ్యాప్తినిఁ గనిశైవులు "జానుతెనుఁగు”లో శైవమతవ్యాప్తి నొనరించుకొని రనుటకు పాలకురికి సోమనాథునిద్విపదవాఙ్మయమే ప్రబలనిదర్శనమని చెప్పవచ్చునని తోఁచుచున్నది,

ఇందువలన మనకుఁ జిక్కినమొదటిశతకములు రెండును 12వ శతాబ్దమునాఁటి కున్నవి శైవమత ప్రతిపాదకములు. 13వ శతాబ్దమునం దున్నతిక్కన్న కృష్ణశతక మొండు రచించె నని "పూర్వకవిచరిత్ర" కారుఁ డనినమాట త్యాజ్యము. ఏపద్యము తిక్కన్న దని యిదివఱకుఁ జెప్పిరో యాపద్యము దేవకీనందనశతకములో నున్నది. దేవకీనందనశతకము తిక్కనకృతము కానేరదు. అది జక్కన విక్రమార్కచరిత్ర కృత్యాదివాక్యానుసారము వెన్నెలకంటి జన్నయ్యది కావచ్చును. “పరమహృద్యం బయిన పద్యశతంబుచే దేవకీతనయు విధేయుఁ జేసె”నని యున్నది. అప్పకవినాఁటి కీదేవకీనందనశతకము లక్ష్యగ్రంథముగాఁ బ్రసిద్ధి నొందియున్నది. దేవకీనందనశతకము నాఁటి కనేక వేల శతకములు మహాకవీశ్వరులు వ్రాసియుండి రని యాశతకమే సాక్ష్య మిచ్చుచున్నదివినుఁడు.

శా. కొండలవంటికవీశ్వరుల్ శతకముల్ గూర్పంగఁ గోటానఁగో
     ట్లుండన్ నీవుమ జెప్పఁబూనితి పదేమో యంటివా వింటివా
     వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుర్విర్తింపవే శాకముల్
     చండా నామన నాలకింపు మదిఁ గృష్ణా దేవకీనందనా||

లేదా కొన్నిప్రతుల యందలిగద్యముల ననుసరించి కవిరాక్షసుఁడే శతకకర్త కావలెను. సర్వేశ్వర, వృషాధిపశతకములయం దం