పుట:Shathaka-Kavula-Charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ix)


గూడ 108 పూసలే నిర్ణయించిరి. ఈశతసంఖ్యాన్విత మగు నిర్ణయము భక్త్యావేశముచేతలుఁ జేసిసస్తోత్రము లయినభక్తిశతకములయందుఁ గూడ వ్యాపించినది. కావుననే ప్రాకృతశతకము, ఆంధ్రశతకములు కూడ 100 లేదా 108 పద్యములతో రచియింపసాగిరి.

వేదములో "శతయీతుఁ" డను ఋషికలఁడు. నూఱుమంత్రశక్తులు - కలఋషినామ మని విజ్ఞులు వక్కాణించియున్నారు. ఈ శతశక్తులనిర్ణయ మధికసంఖ్యాసూచకమో సత్యముగ నాఋషి కట్టి శక్తి కలదో-మన కవసరముకాదు. ఆసంఖ్యయందు మనవారికి గౌరవమున్నట్లు మనకుఁ దెలియుచున్న దది చాలును. శతరుద్రియ, శతరుద్రీయ యను పదములు వేదమునం దున్నవి. దీనికర్థము నూర్వురు రుద్రులనుగూర్చినస్తోత్రము అని వ్యాఖ్యాతలు చెప్పుచున్నారు. ఈశతరుద్రీయము యజుర్వేదము నందలిభాగము. దీనికీశతక నామమునిచ్చిరి. త్రైత్తిరీయసంహిత 4. 5-1-11; కథకసంహిత 17-11-16 ; మైత్రాయణీసంహిత 2-9-1, వాజసనేయసంహిత. 16.1 ఇందు రుద్రునినూఱుగుణములవర్ణన ముండును. గుణభేదము ననుసరించి నూర్గురురుద్రుఁలని యందురు. శతబాలాక్షమౌద్గల్యుఁ డనుఋషి. ముద్గలఋషిసంతతివా డొకఁడు కలడు. ఇతడు వ్యాకర్తయఁట. గాలవమైత్రేయునితో వాదించినట్లు గోపద బ్రహ్మణమునందుఁ జెప్పియున్నది.

మనపూర్వులకు "శత" శబ్దమునం దాదరణ మున్నది. అట్లే. “సహస్ర" శబ్దమునందు నున్నట్లు గాన నగును. దేవతాపూజలయందు సహస్రనామావళి చదువుట మనకుఁ గ్రొత్తకాదు. ఫురాణము లన్నిఁటియందు నిర్దిష్టదైవమునుఁగూర్చి సహస్రనామావళియు, స్తుతిసమయములయందు స్తుతిమాలలు, స్తవరాజములు, దండకములు, శతకములు, సహస్రనామములును వ్రాయుట వాడుకగాఁ గనబడుచున్నది. పురాణవాఙ్మయమునం దిట్టినిదర్శనము లనేక ములున్నవి. ప్రసిద్ధము లగుట నుదాహరింప నైతిని. కావున శతకస్వరూపము భక్తికొఱకు బట్టె ననవచ్చును.