పుట:Shathaka-Kavula-Charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iv)


వివరించును. శాక్యవంశార్హతుల నేడవదశకము. స్త్రీల నెనిమిదవదశకము, అనిందితచరితులవర్తనమునుగూర్చి తొమ్మిదవదశకమును, ముందు పాపులై నరక మొంది, మంచియొనర్చి సుఖు లైనవారిఁ గూర్చి పదవదశకమును వివరించును. (48 పుట)

ఇట్లే కర్మశతకముకూడ “అవదానశతకము” వంటిప్రాచీనశతకము. అవదానశతకము సంస్కృతమునం దున్న దే కొంచెముశీర్షికల భేదముతో నపదానళతక మని "పాలిభాషలో” నున్నది. కర్మశతకము నందు నూఱుకర్మలనుగూర్చి కథ లున్నవి. దీనికి టిబెటుభాషాంతరీకరణముమాత్ర మున్నది. మూలము లేదు. చీనాభాషాలోనికిఁ బరివర్తించినప్రాచీనగ్రంథ మున్నది. దివ్యావదానశతక మని మఱియొకటి కలదు. ఈమూఁడవశతకము పైగ్రంథములతరువాత నే పుట్టినది. మూలము సంస్కృతములో నున్నది. (52, 53 ఫుటలు)

ఇవి యన్నియు వినయపిటకము నుండి పుట్టి యుండవచ్చు నని తత్త్వజ్జు లనుచున్నారు. ఇందశ్వఘోషునిసూత్రాలంకారమునుండికూడ గాథలు తీసికొని చేర్చిరి, దివ్యావదానమునందు వచనము, గాథలు కూడ నున్నవి. దీర్ఘసమానభూయిష్టము లగుసత్య మైన కావ్య శైలి గల శ్లోకము లున్నవి. సులభ మైనవచనములలో సంస్కృతభాగము లున్నవి.. దివ్యావధానమున విషయవిభాగము లేదు. భాష శైలియు సక్రమముగ లేవు. కావున వివిధగ్రంథములనుండి నిది సంపాదితమైయుండును. యేకకర్తృకము కానేరదు. కావుననీగ్రంథము వేర్వేరు కాలములకుఁజెందినకావ్యభాగములకూర్పవచ్చును. ఇదిమూఁడవశతాబ్దమునాఁటికే చీనా భాషలోనికిఁ బరివర్తన మొందె నని చెప్పుదురు. ఇందశోకుఁడు, పుష్య మిత్రుఁడు, శుంగవంశముసుగూడఁ బేర్కొనియుంట దీనికాలనిర్ణయము విచార్యము. ఇందు “దీనార " శబ్దము పలుమార్లు ప్రయోగించుటచే నిది రెండవశతాబ్దమునకుఁ బిమ్మటఁ బుట్టిన దనియే నిర్ణయింప వలెను. అశ్వఘోషునిసూత్రాలంకారమునుండి యిందుదాహారణము లుంట నిది యాతనికిఁ బిమ్మటిది కావలెను. ఇందలి "శార్దూలకర్ణుని”