పుట:Shathaka-Kavula-Charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(iii)


దాససంగదశకము, జారదశకము, గోపాలనదశకము, దుష్టనిగ్రహదశకము, చోరదశకము నిత్యాదిగ విభాగించియున్నాఁడు. పైడిపాటి వేంకటనృసింహకవి తనరామచంద్రశతకమునందు స్తుతిదశకము, వాక్యోన్నతిదశకము', దాససంగతిదశకము, మనోవృత్తిదశకము, సంసార దశకము, మాయాదశకము, తత్త్వదశకము, అభేద, దీనత్రాణ, అవతార, నీతి, దశకము లని విభాగించియున్నాఁడు. కొందఱు వింశతులనికూడ విభాగించియున్నారు. ఈసంప్రదాయము ప్రాకృతశతకములనుండి పరంపరఁగా వచ్చుచున్నది. ఈవిభాగము మనప్రాచీనశతకములయందుఁ గనఁబడుచునేయున్నది. నామ, అవతారదశకములు ప్రతిప్రాచీనశతకమునందును సాధారణముగాఁ గనఁబడుచున్నవి. ఒంటి మెట్టరఘువీరశతకమం దీనియమ మున్నది.

పైని చూపినయవదానశతకము నందలిమొదటినాల్గుదశకములును కర్మస్వభావమును వ్యక్తీకరించుకథలను జెప్పును. అనఁగా నేకర్మ యొనర్చిన ప్రత్యేక బుద్ధుఁ డగుటకు వీలగునో యట్టికర్మల వివరించును. ప్రాకృతమునందు "వర్ణము” లని పాలిభాషలో " పగ్గము” లని పది పది విషయముల విభాగించుట యిట్టిగంథములలో నాచారము. ఫ్రాచీనబౌద్ధయుగమునుండియు నీయాచారాము కనఁబడుచున్నది. ప్రథమదశకము నందలికథ లన్నియు, మూఁడవదశకము నందలి కథలు చాలభాగమును భవిష్యద్విషయఫలసూచకములు. రెండవనాలవదశకముల యందు జాతకకథ లున్నని, ఐదవదశతకమునందు. " ప్రేత వస్తువు”ను గూర్చి వివరణముకలదు. ఒకఋషి సాధారణముగా మౌద్గ ల్యాయనుఁడు ప్రేతలోకమునకుఁ బోయి, తల్లోకవాసుల దుఃఖములఁ జూచి యొక ప్రేతము నెందుల కీజన్మమునకు వచ్చిన దని ప్రశ్నించును. ఆప్రేతము బుద్దునిఁ జూపును. బుద్ధుఁ డాప్రేతము పూర్వజన్మమున నొనర్చినపాపమునుఁగూర్చి చెప్పును. ఆపాపము దాన మీయమియో, యోగితిరస్కారమో, యైయుండును. ఆఱవదశకము మృగమానవులు మంచికార్యములు చేసిస్వర్గలోకవాసు లైనవారలకథల వివరించును. అర్హత (Arhat)నొందుట కనువగుకథలనుగడపటినాల్గుదశకములును