పుట:Shathaka-Kavula-Charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

శతకకవులచరిత్రము


లపైఁ బ్రీతి కనఁబఱచుటయుఁ జూడ నీశతకకర్త మంత్రికులమువాఁడుకాని, తత్ప్రియుఁడుకాని కావచ్చునని తోఁచుచున్నది. ఈపైపద్యము లన్నిఁటియందును సత్యముంట నివి కేవల మితరకవికూడఁ జెప్పియుండవచ్చును. వైదికుఁడు కరణము కారా దనునీతి సరియైనను కాకపోయినను, భావము లట్టివి గోపరాజు రామప్రధానికి బిమ్మట రావలెను. రామప్రధానికథ సత్యమైనచో నాతనికాలము క్రీ. శ. 1185 అగుచున్నట్లు కొన్నినిదర్శనములు కసఁబడుచున్నవి. (చూడుఁడు శ్లోకములు, చాటుపద్యమణిమంజరి) "గోత్రశాస్త్రాంబరేందూనాంసంఖ్యాబ్దే శాలివాహనే” మొదట విప్రులనుండి వేఱుపడి యాఱువేలమందినియోగులు కరణీకవృత్తిలోఁ బ్రవేశించి, నియోగిశాఖ వేఱుపడినపిమ్మటఁ గొంతకాలమునకుఁగదా వైదికుఁడు కరిణీకమునకుఁ బనికిరాఁడనుమాట పుట్ట వలసినది. కావున నీమాట వ్రాసినసుమతిశతకము 12వశతాబ్దమునకుఁ జాలతరువాత కావలసియున్నట్లు తోచుఁచున్నది.

(3) ఇందు "కాఁపు"' శబ్దముకూడ రెండుమూఁడుసార్లుపయోగించియున్నాఁడు. "కాఁపు" శబ్దమునకుఁ బ్రస్తుతము కేవలము " తెలఁగా” యని, శూద్రుఁ డని యర్థ మున్నను "కాఁపు కరణము” లని పూర్వము వాడుకలో నుండెను. అనఁగాఁ బ్రస్తుతము “మునసబు కరణము” లనునట్లే కొంతకాలమునకుఁ బూర్వము "కాపు కరణము” లనుట కలదు. తుఱక ప్రభుత్వములో "మునసబు” అనుపదము మనకు వచ్చినది. "మున్సిఫ్” అనివాడుటయుఁ గలదు. కావునఁ దుఱకప్రభుత్వమునకుఁ బూర్వము “మునసబు" పదమునకు మాఱుగా కాఁపు, శబ్దము వాడియుందురు. కావుననే యీక్రింది పామరపదమునం దాసత్యము వెల్లడియగుచున్నది. తగవులాడినభార్య భర్తననుచున్నది.

"కాఁపూ కరణం నాపట్టయితె? ఏలా కొడతావు కొట్టర! మగఁడ|"

ఇటులఁ గాఁపుశబ్దము గ్రామాధికారి పరమని స్పష్టము. మునసబులు కొండెకాండ్రయిన సనియే యాక్రిందిపద్యము నందలి 'కాఁపు' శబ్దమున కర్థము తీయవలసినట్లు తోఁచుచున్నది.