పుట:Shathaka-Kavula-Charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

37


యందు, పాకమునందు, శైలియందును, మిక్కిలిగ వ్యత్యాసము కనబడుచున్నది.

రెండు గ్రంథములు నేకకర్తృత్వము లనుటకు వీలు కనఁబడదు. ఐనను సుమతిశతకము బాల్యకృత్యమనియో, బాలురకొఱ కుపయోగింప వలె నని యిట్లు, సులభముగ వ్రాసెననియో, తలంపవచ్చు ననుకొందమన్న నాసందేహమునకును బ్రత్యవాయములు, లేకపోలేదు. అవి విచారించెదము గాక !

కాలనిర్ణయము.

బద్దెన కీ. శ. 1070 సంవత్సరము వాఁడని శ్రీ కవిగారి యభిప్రాయము. శ్రీ జయంతి రామయ్య పంతులవారియభిప్రాయానుసార మీతఁడు 1261 క్రీ. శ. న నున్నవాఁడు. ఈరెండు వాదములును సందేహాస్పదములే గాని సునిశ్చితములు కావు. శ్రీరామయ్యపంతులుగారు “వీరనారాయణ చోడబద్దిగ దేవరాజులే” మనబద్దెనయందురు. ఆతని శాసనము ననుసరించి ఈతనికాలనిర్ణయ మొనర్చిరి. ఆతఁడు నీతఁడు నొక్కఁడేయనుట కాధారములు లేవు. ఐనను పైసంగతి విచార్యము. కేవలము నామమునుబట్టియే నిరువురొక్కటి యనవచ్చు ననిన శక్తివర్మ పభుపఱ్ఱుశాసనములో "బద్దేమశ్చ మహారాజో మద్యానో బలిణే” యని యొక బద్దెన్నను బేర్కొనియున్నారు. ఈశాసనము కీ. శ. 1003 — 1015 లోనిది. ఈ బద్దెన యాతఁడేల కాఁ గూడదు? మనబద్దెన కీర్తినారాయణుఁడా!” అని సంబోధించుకొని నాఁడు కాని వీరనారాయణుఁడ నని చెప్పుకొనలేదు. కీర్తినారాయణుఁడు దేవుఁడుకూడ నున్నట్లు తెలియుచున్నది. కావున బద్దెనకాల మింక ననిశ్చత మనియే చెప్పవలసియున్నది.

ఇది బాలురకొఱ కుద్దేశించె ననుటకును గొన్ని యాటంకములు కనఁబడుచున్నవి. సుమతిశతకము నందలియీక్రిందివాక్యములు బాలురకొఱ కుద్దేశించె ననఁజాలము.