పుట:Shathaka-Kavula-Charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

35


కాఁడని శ్రీజయంతి రామయ్యపంతులుగారు వ్రాసిరి. వీరు స్యూయలు పట్టిక ననుసరించి మూలము తెప్పించి ప్రకటించిన శాసనములో నున్న "వీరనారాయణచోడబద్దిగదేవరాజు” మనబద్దెన యని శ్రీ రామయ్య పంతులుగారి యూహ. బద్దెన గ్రంథమునం దున్న 16 బిరుదులలో నొక్కటియైన శాసనమునఁ గనఁబడదు. కేవలము బద్దెననామమును బట్టియే కాలనిర్ణయము చేయవలసినచో శక్తివర్మశాసనము నందొక బద్దెన కలఁడు. కావున నీతనికాలము సందేహముగనే యున్నది. "శ్రీవిభుఁడ" అనుపద్యము బద్దెన దే యైనచో నట్టి శతకము మఱియొకటి యుం డునా? సుమతిశతకపువ్రాఁతప్రతులనింకను బరిశీలింపవలసియున్నది.

సుమతిశతక మాబాలగోపాలమునకుఁ బఠనీయమై చిరకాలమునుండి యాంధ్రదేశమున రాజ్యము చేయుచున్నది. ముద్రణ మారంభమైనది మొద లాంధ్రమున నిది యెన్నివేలప్రతు లందినదో చెప్పుటకు వీలులేదు. ఇంతప్రచారము గలయీశతకకర్తృత్వ మింత వఱకు మనకుఁ దెలియదు. పోనిం డిది యేకాలమునందుఁ బుట్టి సదో కూడఁదెలియదు. కొన్ని లక్షణగ్రంథములలో సుమతిశతకము భీమ కవికృత మని 'యుదాహరణము లిచ్చెదరు. అట్లుదాహరించిన పద్యము లొకటి రెండు నేను పోల్చి చూడఁగా నాకవి ప్రస్తుత సుమతిశతకమునందుఁ గాన్పింపలేదు. ఒకటి చూపెదను.

"క. కాదన్నవాఁడె కరణము | వా దడచినవాఁడె పేడి వసుధేశూకడ౯
    లే దన్నవాఁడె దనపరి! గాధలు పెక్కాడువాఁడె కావ్యుఁడు సుమతీ!!"

ఈ లక్షణగ్రంథ మెప్పటిదో తెలియదు. కాని యీపద్యము భీమన్నగారి సుమతిశతకము లోని దని"దథ” లకుఁ బ్రాసమైత్రికలదని చూపుట కీయఁబడినది. (పరిషత్పత్రిక సంపుటము 6, పుట 456 చూడుము) ఈ పద్యము ప్రస్తుత సుమతిశతకమున లేదు. ఈ భీమన్నగారినే వేములవాడ భీమకవి యని మనవా రీశతక కర్తృత్వ మాతని దని యుండియుండవచ్చును. ఈతఁ డేభీమన్నయైనను సుమతిశతక మీతనిది వేఱని తోఁచుచున్నది.