పుట:Shathaka-Kavula-Charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శతకకవులచరిత్రము


బద్దెన

బద్దెన వ్రాసిస నీతిసారముక్తావళిలో నీతఁడు తన్నుఁదానే యీ క్రిందినామముల సంబోధించుకొనినాఁడు. (1) బద్దిభూపతీ (2, బద్దన (3) కీర్తినారాయణుఁడా (4) ఉదారవైరోచనుఁడా (5) బద్దెన రేంద్రా (6) రాజమనోజభూభుజా (7) నరేంద్రచతురాననుఁడా (8) వివేక చతురాననుఁడా (9) కార్యచతుర్ముఖా (10)నన్నేచోడనరేంద్రా (II) దశదిశాభరణాంకా (12) పరపక్ష భైరవా (13) నన్ననగంథవారణా (14) వివేక భూషణా (15) రాజరాజమనోజా (16) కొమరురభీమ. ఇందుఁ గొన్ని కేవలగుణవాచకములు, బిరుదులు నై యున్న వి. ఇవి యన్నియుఁ గవివరముగఁ జెప్పుకొనినవే!కొంద ఱివి పరులను సంబోధించె ననవచ్చును గాని కవి కొన్ని తన్ను, కొన్ని యితరులను సంబోధించి గ్రంథము వ్రాయువాడుక లేదు. అట్టిసంప్రదాయము మృగ్యము. ఈబిరుదులలోఁ గీర్తినారాయణాదు లొరయూరుపురాధీశు లగుచోడవంశజుల కున్నట్లు నిదర్శనము లున్నవి. ఈవిష్ణుభక్తుఁ డగుకవి, శివభక్తుఁ డగు కుమారసంభవకర్త కాఁడు. వీరిరువురు చోడులు, సూర్యవంశుజులు, సుమతిశతకము వ్రాసితి నని బద్దెన చెప్పినట్లు మా.రా. కవిగా రుదాహరించినపద్యములో "శ్రీవిభుఁడ” ననుపదము రాజుపరముగ నర్థము చప్పవచ్చును గాని "లక్ష్మీవల్లభపదపద్మారాధకుఁ" డగుకవి యిట్లు “లక్ష్మికి మగఁడ” నని స్ఫురించునట్లు వ్రాసికొనునా?

రుద్రదేవుఁడు వ్రాసిననీతిసారమునందు బద్దెన పద్యము లుండుటచే బద్దెన 1150 క్రీ. శ. లో నున్నరుద్రదేవునకుఁ బూర్వుఁ డనుచున్నారు. భువనైకల్లుమనికి సామంతుఁ డగుభద్రభూపాలుఁడు (బద్దెన?) 12 శతాబ్దమువాఁడని శ్రీచిలుకూరి వీరభద్రరావుపంతులుగా రాంధ్రులచరిత్రమున వ్రాసిరి. కాకతీయరుద్రమదేవి సామంతుఁడుగా క్రీ. శ. 1261 సంవత్సరమున జిన్న రాజ్యమును బాలించిన బద్దెన యంతపూర్వుఁడు