పుట:Shathaka-Kavula-Charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

25


డును, మంత్రియును, ఆపస్తంబసూత్రుఁడు, హరితసగోత్రజుఁడు నగు సూరనామాత్యునకుఁ గృతి యిచ్చెను. “గణసహస్రనామము దీపకతి చరిత్రము నీయారాధ్యబాహ్మణుఁడు వ్రాసె” నని పద్య----- వ్రాసిరి గాని యవి పండితయ్యకృతు లని సోమన్న యే చెప్పెను. కావున నీతనివి కానేరవు.

ఈతఁడు వ్రాసినగ్రంథములలో, జాటుకృతులు పెక్కు లున్నట్లు తెలియుచున్నను మనకుఁ జిక్కినవి స్వల్పము. అందు ముఖ్య మైనవి (1) వృషాధిపశతకము (2) చెన్నమల్లుసీసములు (3) చతుర్వేదసార సూక్తులు[1]

ఇందలివృషాధిపశతకము (108 పద్యములు) చంపకోత్పల మాలాసంఘటిత మైనభక్తిశతకము, ఇది బసవేశ్వరునిశివస్వరూపునిగా నెంచి యాతనిసంబోధించి చెప్పినది. "బసవా ! బసవా! బసవా! వృషాధిపా ! " అని మకుటము. నూఱువిధంబుల స్తుతింతు నని కవి యనుచున్నాఁడు.

“నోరికి వచ్చినట్టు లోకనూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే
 నేరుతు నేరఁ బొమ్మనక నీపయి పొచ్చము లేనిమచ్చిక౯
 గారవ మొప్ప మత్ప్రుణుతిఁగైకొనఁగాఁ దగు గారవింపు నిం
 పారఁగఁగూర్మిఁ బూని బసవా బసవా బసవా వృషాధిపా!! 106

ఈశతక మీతఁడు బసవపురాణము రచియించినది. ప్రజలు మెచ్చుటఁ జూచి, భక్తులు బసవన్నను స్తుతించుట కనువుగానుండున ట్లిది వ్రాసియుండె నని యీ క్రిందిపద్యమువలన ద్యోతక మగు చున్నదిగావున నీశతక మీతఁడు బసవపురాణానంతరమే వ్రాసి యుండెను.

"బసవఁడు ప్రీతిఁ గైకొనియె భక్తి మెయిన్ విరచించినాఁడు మున్
 బసవపురాణ మంచుననుఁ బ్రస్తుతిసేయుదు రట్లుఁగాన నీ

  1. ఇది బసవన్న వ్రాసినదానికిఁదెలుఁగనియువీరశైవము శ్రుతిసమ్మతమనియు సమర్థించును.