పుట:Shathaka-Kavula-Charitramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శతకకవులచరిత్రము

       హవి యజ్ఞాలిగె భూషణం సతిగె పాతివ్రత్యవే భూషణమ్
       కవి యాస్థానకె భూషణం హరహరా! శ్రీ చెన్నసోమేశ్వరా!!

మ!! చెరిపారణ్యక పక్షిగొందు తరుగొడ్రాగల్ ఫలంతీవిదా
       మరగల్ పుట్టవె పుష్ప మొందు బళలల్ భృంగక్కె వూవిల్లవే
       దురుళన్ సత్కవి గోర్వగర్విపుసియం తాంపేళ్ దొడెం లోభరిం
       ధరయున్ దాతరు పుట్టరే హగహరా! శ్రీ చెన్నసోమేశ్వరా!!"

ఇందు మొదటి పద్యమునకర్థము:-

“ఆకాశమునకు రవిభూషణము, రాత్రికిఁజంద్రుఁడుభూషణము, వంశమునకు పుత్రుఁడుభూషణము, కాసారమునకుఁ బద్మములుభూషణము, యజ్ఞమునకు నేయి భూషణము, సతికిఁ భాతివ్రత్యము భూషణము, ఆస్థానమునకుఁ గవి భూషణముకదా. హరహరా ! శ్రీచెన్నసోమేశ్వరా!”

ఈతఁడు కవియగుటయేగాక గొప్పపండితుఁ డని సోమనాథభాష్యము సాక్ష్య మీయఁగలదు. ఇతని భక్తు లగుపిడుపర్తిసోమనాధుఁడు బసవపురాణపద్యకావ్యమును మఱియొకకవి యన్యవాద కోలాహలములును సోమనాథుని పేరకృతుల నిచ్చిరి. పిడుపర్తి బసవకవి తనప్రభులింగలీల పద్యకావ్యము గద్యలో "ఇది శ్రీమత్పాలుకురికి సోమేశ్వరవరప్రసాదలబ్ద కవితాచాతుర్యుఁ" డ నని వ్రాసికొని భక్తినిఁ జూపియున్నాఁడు. అనేకశైవకవు లీతనిదైవమువలె నారాధించి కావ్యాదినిఁ బ్రశంసించియున్నారు.

ఇతడు భృంగిరిటగోత్రజుఁడు. జంగమలింగార్చనావిశారదుఁడు. సంగీతశాస్త్ర పారంగతుఁడు. యతీశ్వరుఁడు, శైవదేశికుఁడు, "వేదవేదాంగవేత్త, వేదభాష్యకారుఁడు, అతిదయాంతఃకరణుఁడు, మంచితార్కికుడు, అతివిరాగసంపన్నుడు. ఆకాలమునందు రాజులను మంత్రులను తనవాక్కు చేతను, యుక్తిచేతను మెప్పించి దాసులనుగా, శిష్యులనుగాఁ జేసికొనినవాఁడు. శైవమతము నిరంకుశగమనము నొందున ట్లొనర్చినవాఁడు. మంచివిజ్ఞానశాలి.. అభినవవ్యాసుఁ డని శిష్యాళిచే బొగడ్తఁగ