పుట:Shathaka-Kavula-Charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

19


నిందుఁ దిరిగి చర్చింపలేదు. 1222 లో నున్నసోమరాజు తనయుద్భట కావ్యములోఁ బాలుకురికి సోమన్నను బొగడియుంట దీనికిఁ జర్చ యవసరము లేదు.

ఇవిగాక యీతఁడు కర్ణాటకభాషయందు సోమేశ్వరశతకాదులు వ్రాసినట్లు తెలియుచున్నది. కొందఱు పరిశోధకులు సోమేశ్వరశతకము పులిగిరి సోమన్నకృత మనుచున్నారు.[1] పైపద్యములోఁగూడ నీసోమనాథశతకము పాల్కురికి సోమన్న కృత మని చెప్పియుండలేదు. ఐనను కన్నడసోమనాథశతకమునుండి యొండురెండు పద్యములఁ జూ పదను. ఇవికన్నడపద్యసారము నుండిగ్రహించితిని. ఈ విషయము (29-6-1917) లో నేను కృష్ణాపత్రికలోఁ బ్రకటించియుంటిని.

మ!! "రవి యాకాశకె భూషణం రజనిగం చంద్రం మహాభూషణమ్
       కువరం వంశకె భూషణం సరసి గంభోజాళి గెవభూషణం

  1. "Palukuriki Soma (C 1195) was a learned scholar born at Palkuriki in the Godaveri District. After defeating in controversy the Vyshnava Sastris there, he removed to Kalleya in the Kanarese country. He wrote more especially in Sanskrit and Telugu. A Telugu Basavapurana by him is said to have formed the basis of Bhima Kavi's Basavapurana. Among his Kanarese Works there is said to have been a Sataka, and some have identified this with the wellknown and widely read Someswara Sataka, an attractive cento of verses on moral subjects. This work is however so loose and faulty, in grammar and style that Mr. Narasimha Chariar thinks it could not have been written by one who, like Palkuriki Soma, was acquainted with Sanskrit. He also points out that Lingayats themselves do not include it in the list of writings by Palukuriki Soma. Besides which, the author never calls himself Palukurike Soma, but implies that he belonged to Puligire (Lakshmiswer). The date of Paligire Soma is not certainly known, but he may have belonged to this period.". Pp. 44 Rice's Kan Lit.