పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమీక్ష

పందొమ్మిదవ శతాబ్దమున సుప్రసిద్ధులగు ఆంధ్ర పండితులలోఁ బేరెన్నికగన్నవారు శ్రీమాన్ పరవస్తుచిన్నయసూరిగారు. ఈయన మద్రాసులోని కళాశాలలయందుఁ బ్రధా నాంధ్రోపాధ్యాయత్వము వహించి యాజీవితాంతమును సారస్వతసేవచేసిన మేటిపండితుఁడు.

శ్రీచిన్నయసూరి కేవలముపాధ్యాయుఁడేకాఁడు. గొప్ప పరిశోధకుఁడును. ఈయన యొకవంక నుపాధ్యాయత్వము నెఱపుచు వేఱొకవంకఁ బ్రాచీనాంధ్ర వాఙ్మయమును బరిశోధించుచుఁ బదసమూహమును బ్రయోగవిశేషములను సంగ్రహించి బాలుర కుపయుక్తమగు పద్ధతిలో నొక కోశమును నొక వ్యాకరణమును రచింపఁ బూనుకొనెను. ఆ విధముగా రచింపఁబూనిన వ్యాకరణమునకుఁ బూర్వరూపములలో నేకదేశమే యీ శబ్దలక్షణ సంగ్రహము. ఇంతకంటెను బూర్వ రూపములు మనకు లభించినవి మఱికొన్ని గలవు. అవి పద్యాంధ్ర వ్యాకరణము, ఆంధ్ర శబ్దానుశాసనము, సూత్రాంధ్ర వ్యాకరణమును. ఇందు సూత్రాంధ్ర వ్యాకరణము తప్పఁ దక్కినవి తెనుఁగు రచనలు.

సూరిగారు తొలుత పాణిని మహర్షిరచితమగు అష్టాధ్యాయి నాధారముగాఁ గొని ప్రత్యాహారాది పద్ధతులను, అనువృత్త్యాది మార్గములను అవలంబిుచి యాంధ్రభాషకు సమగ్రమగు నొక వ్యాకరణమును సంస్కృత సూత్రరూపమున