పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఇందును సూత్రాంధ్ర వ్యాకరణము నందును బాల వ్యాకరణమున లేని పెక్కువిషయములు గలవు. ఈ శబ్దలక్షణ సంగ్రహమునకు వృత్తి లేకపోవుటచే నిందలి కొన్ని సూత్రముల యర్ధము సుగ్రహము కాకున్నది. దీనికి వృత్త్యుదాహరణములు పుట్టుట యత్యావశ్యకము. దీనిలోని పెక్కు విషయములుగల బాలవ్యాకరణమునకు వృత్త్యుదాహృతులు శ్రీ చిన్నయసూరిగారిచే రచింపఁబడినను బాలవ్యాకరణమున లేని సూత్రముల వృత్త్యుదాహరణములు వ్రాయఁబడుట యావశ్యకము.

కోడుగంటివారి వీధి,

విజయనగరము

10 - 4 - 58

విన్నవించు సుజనవిధేయుఁడు

వఝల చినసీతారామస్వామిశాస్త్రి