పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ పరిచ్ఛేదము

21. ఉభయంబులు సవర్ణంబులు.

22. అంతస్థంబులు లఘువు లలఘువులు నా ద్వివిధంబు లగు.

23. అన్యంబు లన్యవ్యాకరణ స్పష్టంబులు.

24. ఇంద రేంబు.

25. ప్రత్యయంబు వర్ణకంబు.

26. పదంబు ద్రుతాంతంబు ద్రుతప్రకృతికంబు.

27. అస్యంబు కళ.

28. ఖండబిందునకుఁ బూర్ణం బగు.

29. అంతట దీర్ఘంబుమీఁదం బొడమదు.

30. స్థిరంబు బిందుపూర్వంబు గాదు.

31. జిత్తగు.

32. యకారోష్ఠజస్వరకవకారంబులు పదాదిని లేవు.

33. అచ్చు మీఁది యచ్చునకు యడాగమం బగు.

34. రా సనం బరంబగుచో నని యెఱుఁగుసది.

35. అవ్యయ సుప్తిజంతంబు లనుకరణంబుం ద్రిక్కం బ్రయోగింపఁ జనదు.

36. ఈభాష తత్సమంబు తద్భవంబు దేశ్యంబు గ్రామ్యంబు నా నలువిధంబులం బరఁగు.

37. ప్రకృతిద్వయతుల్యంబు తత్సమంబు.

3