పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జోతలు

ఈ శబ్దలక్షణ సంగ్రహమునకుఁ బరిచయ వాక్యముల నొసఁగిన పూజ్యతాతపాదులు, కళాప్రపూర్ణులు, శాబ్దికతత్త్వ పరిశోధ కాగ్రేసరులునగు శ్రీవజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులవారికి వినయపూర్వక నమశ్శతములు.

ఈ గ్రంథమునకు వెలుఁగు బాటను జేకూర్ప 'సమీక్ష' నొనర్చిన పుంభావసరస్వతులు, సంస్కృతాంధ్ర వ్యాకరణశాస్త్ర పారంగతులు మద్గురువులు నగు శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రులవారికి భక్తిపూర్వక నమస్కృతులు.

చిరకాలమున ముద్రింపఁబడి నేఁడు లభింపని యీగ్రంథమును గోరినంతనే నా కొసఁగిన నరసరావుపేఁట వాస్తవ్యులు శ్రీ వంకాయలపాటి మల్లయ్యగుప్తగారికిఁ బ్రియపూర్వక సమస్కారములు.

కొండవీటి వేంకటకవి

ఆంథ్రోపన్యాసకులు

సంస్కృతకశాశాల

పొన్నూరు

15 - 4 - 58