పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


కావించి రఖిల యజ్ఞ ద్రవ్యములుదెచ్చి
             పూర్ణాహుతుల సామమును బఠించి
సేవించి రబ్జగర్భావాస దేవేశ
             ముఖగణమ్ముల కర్ఘ్యములుఘటించి
భావించి రానుపూర్స్యముగఁ దద్వంశాధి
             నాయకాగ్రణులకు దోయిలించి
పూజించి రధ్వరమ్మున నిల్చు యాయజూ
             కుల కనర్ఘాంబరావళు లొసంగి

నీతిదప్పక పరుల మోఁచేతినీరు
ద్రావక గడించు ధన మర్థితతికి నిడిరి
శక్తిపొలివోని దశరథేశ్వరులటంచుఁ
బ్రజలు జయవెట్ట యజ్ఞనిర్వహణమందు.

నన్నయ తిక్కనాది కవినాథుల మార్గములం గమిచితె
ల్గన్నల పున్నెపుం గనులుగా వచనంబున దిద్ది తీర్చితో
యన్న! మహాంధ్రకావ్యము లహర్నిశముం గవితాసమూధిలో
బన్నిన భావబంధు రసబంధములా ! పరవస్తు చిన్నయా !

అవి యివి యన్ని సాధువగు నన్నపథంబును వీడి శాస్త్ర, గౌ
రవమును నిల్పఁబెద్దలు పరాకున నొక్కటఁ దప్పుదారి వె
న్దవిలిన వానినన్నిటి ననాదరణీయ మటంచుఁ ద్రోసి నీ
యవికృత సత్వముం దెలియునట్టు లొనర్చితివయ్య! చిన్నయా!