పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనసూరి

కార్యాకార్య విచారశీలుఁడగు వేంకట్రంగరామానుజా
చార్యుం డాదృతి శ్రీనివాసమను యోషారత్నముం బత్నిగా
నార్యుల్మెచ్చఁ బరిగ్రహించె నయవిద్యాశీల వాగ్ధుర్యసౌం
దర్యౌదార్యయటన్న మేలిపలుకంటం ది గ్విదిగ్ర్వాతముల్.

ద్రవిడవేదప్రబంధమ్ము లుద్గీతింప
           నధ్యాపకస్థానమందు నిలిచె
మంత్ర మంత్రార్థధర్మములు వెల్లడిచేసి
           కావించెఁ బంచ సంస్కారములను
సంస్కృత ప్రాకృతాచ్ఛద్రావిడాంధ్ర భా
           షల గురుండియ్యె సంస్తవమునంది
శేముషీఘనుఁడు లక్మీనృసింహులు సెట్టి
           తోడుగా నున్నతోద్యోగియయ్యె

సమముగా జూతులెల్ల మోక్షము గమింప
మార్గముంజూపె నపర రామానుజన్ముఁ
డితఁడటంచును జనులు సంస్తుతి యొనర్ప
నలరె వేంకటరంగ రామానుజుండు.

తుష్టింబుష్టినిగూర్చు కూఁతును నొకర్తుంగాంచి వైధవ్యమై
నష్టింగాంచిన దాది లోకము మహాంధప్రాయమై తోఁచె నా
శిష్టాచారుల శోకవారిధులు ముంచె౯ బుత్రకామేష్టితో
నిష్టైశ్వర్యములంద దంపతులు లక్ష్మీశాత్త చిత్తాబ్జులై.