పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


నొకటి యన్నమాట. ఇయ్యది యున్నదున్నట్లుగా విద్యార్థుల కంత యుపయుక్తము గాకున్నను చిన్నయసూరి వ్యాకరణ రచనా పరిశ్రమను గూర్చి పరిశోధన యొనర్చు పండితులకు మాత్రమెంతయు నుపకరించును. దీనిని 1902 వ సంవత్సరములో ఓ. వై. దొరస్వామయ్యగారు చెన్నపురిలో వే. నా. జూబ్లీ ముద్రాక్షర శాలయందు ముద్రించి ప్రకటించిరి. సుమారేఁబది సంవత్సరముల యీ నడుమ కాలములోఁ బునర్ముద్రణమే లేక దీని యునికియే చాలమందికిఁ దెలియదయ్యెను.

ఇట్టితఱి నీ గ్రంథము నుద్దరించి శ్రీ కొండవీటి వేంకటకవి పునర్ముద్రణ మొనరించుట తప్పక పరిశోధకుల మెప్పు నందఁగలదు. ఈతని లక్షణాసక్తిని మనసార సభినందించుచుఁ బండితమిత్రులు దీనికిఁదగిన ప్రచారము గలిగింప సభిలషింతును.

దువ్వూరి వేంకటరమణశాస్త్రి

ఆంధ్ర విశ్వకళా పరిషత్పండితుఁడు

వాల్తేరు

30 - 3 - 58