Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

33


సుందరాపురవృర్త్తి ముందుగా ధనంబు [1]
            కోరి తా ఇచ్చి ధీరుడ వని
మాతృగోత్రోద్భవ మండ్డలతంమ్మన్న
            అరయంగ నిత్యపంచామృతంబు
శుభగుండై మిగుల భూసురవ(రు)ల్ బొగడంగ
            నభిషేక మొనరించె భక్తితోడి
అరయ సహస్రనామర్చన చామరం
            బును పంకణమును మరి ఘనసురంఠియు...
(యో?)గశేవల షోడశోపచారసమేత
            మైన పూజలు సల్పె మాన్యు డగుచు
ఆచంద్రతారార్క మవనియెందున పుత్ర
            పౌత్రాభివృద్ధియై ప్రబలియుడు
యెనుచు విజ్ఞానశాస్త్రంబు నెలమి
చదివినభూసురేందృలు ఈరీతి సంస్తుతింప్ప
విని కృతార్ధుడ నైని నన్వేడుకలరా(ర)
ధర్మ మిది యెని వినుతించె ధాత దివిని.


స్వదత్తాద్విగుణం పుణ్యం వరదత్తానుపాలనం.

—————

42

శ. స. 173(2)

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామి యాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిరెండవస్తంభము నుత్తరపువైపున చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1202)

శ్రీ.


సీ.

శాలివాహనశకసంవ్వత్సరములు వె
            య్యేడు నూటాముప(దా)రువెళ [2]

  1. ఈయుత్తరభాగములో ఛందస్సు తప్పినది.
  2. ప్రమోదూత సంవత్సరము 1732 వ శకసంవత్సరమునకు సరిపోవును.